Nepal Flash Floods: నేపాల్ వరదల గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజు రోజుకూ నేపాల్‌లో మిస్సింగ్ అయినవారు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ సీఈఓ లక్స్ గోపీశెట్టి గల్లంతు అయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆయన నేపాల్ వెళ్లినట్టు సదరు కంపెనీ తెలిపింది. ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది.
నేపాల్‌లో ప్రకృతి కన్నెర్రపై రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతులు, మిస్సింగ్ అయినవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ గల్లంతైనవారి ఆచూకీ పూర్తిగా లభించలేదు. ఇప్పటివరకు 2400 మంది జాడ కనిపించలేదు. ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దాదాపు 5 వేలు వరకు ఉండవచ్చని నేపాల్ స్థానిక పత్రికల మాట. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న దాదాపు 4400 మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. గల్లంతైన వారిలో ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ సీఈఓ లెక్స్ గోపిశెట్టి కూడా ఉన్నారు . ఆయన వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. వరదల తర్వాత ఆయన్ని సంప్రదించేందుకు కంపెనీ అనేక ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటివరకు కనెక్ట్ కాలేదని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. మా సహోద్యోగి లక్స్ గోపిశెట్టి ప్రస్తుతం అందుబాటులో లేరని మేము ధృవీకరించగలమని ఆ కంపెనీ పేర్కొంది. అతని గురించి సమాచారం సేకరించేందుకు మేము సంబంధిత ప్రభుత్వ అధికారులు-ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నామని, అతని కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.
ఈ క్లిష్ట సమయంలో అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తున్నామని తెలిపింది. కంపెనీ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం.. గోపిశెట్టి ప్రధానంగా అమెరికా, కెనడాలపై దృష్టి సారిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలు- వారి ఏజెన్సీల లక్ష్యాలను నెరవేర్చడానికి వ్యూహాలను రూపొందించడంలో సలహాలు ఇస్తారు. చాలా సంవత్సరాలుగా ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్నారు లెక్స్ గోపిశెట్టి. అంతకుముందు ఆయన ఇన్ఫోసిస్‌లో గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌గా, బిజినెస్ అప్లికేషన్స్, డిజిటల్ వర్క్‌స్పేస్ సర్వీస్ విభాగాధిపతిగా పని చేశారు.
ALSO READ: డ్రోన్ ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులకు సిమ్ కార్డులు సప్లై.. నిందితుడి అరెస్ట్!
గల్లంతైన వారి గురించి సమాచారం సేకరించేందుకు నేపాల్ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. ఆకస్మిక వదల కారణంగా ఇప్పటికీ 320 మంది భారతీయులు గల్లంతయ్యారు. టిబెట్ సరిహద్దు పరిసరాల్లో చాలా మంది చిక్కుకుపోయారు. కాఠ్మండుకు అన్ని విధాలా సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ తెలిపారు. భోటే కోసి నదిలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 287 మంది భారతీయులు, 128 మంది ఎన్ఆర్ఐ వ్యక్తులు గల్లంతయ్యారని పేర్కొన్నారు.