BigTV English

Mouth Freshener: ప్రాణంతకంగా మౌత్ ఫ్రెషనర్.. రక్తపు వాంతులు చేసుకున్న కస్టమర్లు

Mouth Freshener: ప్రాణంతకంగా మౌత్ ఫ్రెషనర్.. రక్తపు వాంతులు చేసుకున్న కస్టమర్లు

Mouth Freshener


5 People Fell ill after Consuming Mouth Freshener in Gurugram Restaurant: మౌత్‌ ఫ్రెషనర్‌ ప్రాణాంతకంగా మారుతోంది. హర్యానాలోని గురుగ్రామ్‌లోని రెస్టారెంట్‌లో మౌత్‌ ఫ్రెషనర్‌ తిని ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.

అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, ఆమె స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేశారు. డిన్నర్ తర్వాత మౌత్‌ ఫ్రెషనర్ తిన్నారు. అయితే.. కాసేపటికే.. నోటి నుంచి రక్తం రావడంతో పాటు వాంతులు చేసుకున్నారు. ఈ ఘటనపై గ్రేటర్‌ నోయిడాకు చెందిన అంకిత్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెస్టారెంట్‌ సిబ్బంది పారిపోయారని పోలీసులకు చెప్పారు.


బాధితుల ఫిర్యాదు మేరకు ఖేర్కీ దౌలా పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

వివరాలను పరిశీలిస్తే.. హర్యానాలోని షాకింగ్ ఘటన జరిగింది. ఓ కేఫ్ కు వెళ్లిన ఐదురుగురు వ్యక్తులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ ఐదుగురు స్నేహితులు కలిసి గురుగ్రామ్ లోని సెక్టార్ 90లో లాఫోరెస్టా కేఫ్ కు వెళ్లారు. అక్కడ అందరు కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత మౌత్ ఫ్రెష్ నర్ తీసుకున్నారు. ఇక రెస్టారెంట్ బయటకు వస్తుండగా అక్కడే రక్తపు వాంతులు చేసుకున్నారు.

అయతే వారిలో కొందరు నోరు మంటగా ఉందని, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరికి నోటిలో నొప్పి మ మొదలైంది. నాలుకపై వేడి కారణంగా పగుళ్లు ఏర్పడటం పలు సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడ ఉన్నవారంతా వీడియాలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు కాస్తా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×