BigTV English

TS DSP Transfers : తెలంగాణలో మరో 47 మంది డీఎస్పీలు బదిలీ.. డీఎస్పీ ప్రణీత్ సస్పెండ్!

TS DSP Transfers : తెలంగాణలో మరో 47 మంది డీఎస్పీలు బదిలీ.. డీఎస్పీ ప్రణీత్ సస్పెండ్!


Telangana DSP Transfers List: తెలంగాణలో పోలీసుల బదిలీల పర్వం కొనసాగుతోంది. మరో 47 మందిని బదిలీ చేస్తూ.. సోమవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ.. డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితమే ఆయన్ను ప్రభుత్వం డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయగా.. తాజాగా సస్పెండ్ చేయడం గమనార్హం. కాగా.. గతంలో ఆయన ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో.. గడిచిన నాలుగేళ్లలో మూడేళ్లపాటు ఒక పార్లమెంట్ పరిధిలో పనిచేసిన వారిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకే రాష్ట్రంలో పోలీసుల బదిలీల పర్వం జరుగుతోంది. ఇటీవలే ఐపీఎస్, ఐఏఎస్ లను ట్రాన్స్ ఫర్ చేయగా.. తాజాగా మరో 47 మంది డీఎస్పీలకు స్థానచలనం కలిగింది. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే ఆయన్ను సస్పెండ్ చేస్తూ తెలంగాణ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తూ.. తనకు ఇంకా మూడేళ్లు పూర్తి కాలేదని తప్పు సమాచారం ఇచ్చాడు. దానిపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.


Read More: ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న ప్రధాని.. NH-161 జాతికి అంకితం

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×