E-Paper
Advertisement

Students: తీవ్ర విషాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి

Students: తీవ్ర విషాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి
Advertisement

5 Medical Students died: వాళల్లంతా వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. అయితే, ఓ వివాహానికి హాజరయ్యారు. ఆ తరువాత పక్కనే ఉన్న సముద్రపు ఒడ్డున కాసేపు ఎంజాయ్ చేద్దామనుకున్నారు. కానీ, వారి ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. సముద్ర తీరానికి వెళ్లిన కొద్దిసేపటికే అల రూపంలో వారిని మృత్యువు కబలించింది. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలోని ఓ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులు, వీరితోపాటు మరో ఏడుగురు స్నేహితులు కలిసి నాగర్ కోవిల్ లో జరిగిన ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తరువాత సోమవారం ఉదయం అక్కడి నుండి లేమూర్ సముద్ర తీరానికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఓ పెద్ద అల వచ్చి వారిని సముద్రంలోకి ఈడ్చుకెళ్లింది.

Advertisement

ఈ ప్రమాదంలో ఐదుగురు మెడికల్ విద్యార్థులు మృతిచెందారు. మరో ముగ్గురు స్నేహితులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చదువు కోసం వెళ్లిన తమ పిల్లలు అనుకోని ప్రమాదంలో చిక్కి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తీవ్రంగా విలపిస్తున్నారు.

Also Read: రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

Advertisement

అయితే, అంతకుముందు రోజు ముగ్గురు వ్యక్తులు కూడా ఇదేమాదిరిగా నీటిలో మునిగిపోయి మృతిచెందారని, రెండురోజుల్లోనే మొత్తం 8 మంది మృతిచెందినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులు ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకున్నారని.. బీచ్ మూసివేసి, అక్కడికి ఎవరూ రాకుండా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×