E-Paper
Advertisement

Director Harikumar: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

Director Harikumar: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
Advertisement

Malayalam Director Harikumar: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సినీ సెలబ్రెటీలు రకరకాల సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్, గుండెపోటుతోనే ఎక్కువ మంది ప్రాణాలు విడిచారు. ఇప్పుడు మరొక ప్రముఖ దర్శకుడు తుదిశ్వాస విడిచాడు. మలయాళ సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు, కథా రచయిత హరికుమార్ తాజాగా కన్నుమూశారు.

హరికుమార్ గత కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతూ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే పరిస్థితి విషమించడంతో తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్నుమూశారు. ఆయన మృతి మలయాళ సినీ ఇండస్ట్రీని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకాభిమానులను ఊర్రూతలూగించిన దర్శకుడు హరికుమార్ ఇక లేడని తెలిసి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఆయన మరణంతో మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ నటీ నటులు, ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలుపుతున్నారు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. హరికుమార్ తొలి సినిమా అంబల్ ఫూ.. ఇది 1981లో రిలీజ్ అయింది. అలాగే హరికుమార్ దర్శకత్వం వహించిన మరో చిత్రం ‘సుకృతం’. ఈ మూవీతో అతడి పేరు మారుమోగిపోయింది.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రీ-రిలీజ్‌కు సిద్ధం.. ఈ సారి 3డీలో

Advertisement

ఎం.టి. వాసుదేవన్ నాయర్ స్క్రీన్ ప్లే అందించాడు. ఇందులో మమ్ముట్టి, గౌతమి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా ది బెస్ట్ మలయాళ చిత్రంగా జాతీయ అవార్డును సైతం దక్కించుకుంది. మొత్తంగా ఆయన ఓ పదిహేడు, పద్దెనిమి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

అందులో సద్గమయ, అన్‌టోల్డ్ స్టోరీస్, స్వయంవరపంటల్, పులర్‌వేతం, సుకృతం, ఉద్యానపాలకన్, ఉజం, జలకం, ఎజున్నల్లాట్, అయనం, పులి వానినే పులి, ప్రేమించే మీరా, అంబల్ పూవ్, ఒక ప్రైవేట్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇక ఆయన చివరి సినిమా ‘ఆటో-రిక్షాకరంటే భార్య’. ఇది 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×