BigTV English

Minor boys threats letter to ex minister sidda: మాజీ మంత్రికి బెదిరింపు లేఖ, ఏడు కోట్ల ఇవ్వకుంటే.. ఇంట్లో బాంబు

Minor boys threats letter to ex minister sidda: మాజీ మంత్రికి బెదిరింపు లేఖ, ఏడు కోట్ల ఇవ్వకుంటే.. ఇంట్లో బాంబు

Minor boys threats letter to ex minister sidda: ఒంగోలు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. ఈ మధ్యకాలంలో ఆయనకు బెదిరింపులు తీవ్రమయ్యాయి. తాము చెప్పినట్టు చేయకపోతే మీ ఇంటిని బాంబులతో పేల్చేస్తామంటూ ఆయనకు లేఖ రాశారు ముగ్గురు మైనర్లు.


ముఖ్యంగా ఏడు కోట్ల రూపాయలు ఇవ్వాలన్నది మైనర్ల ప్రధాన డిమాండ్. అయితే మైనర్లు ఇంటికి వచ్చిన లేఖ వదిలిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. బాలురులు ఒంగోలు‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు.

ఇంతకీ మైనర్లు బెదిరింపు లేఖల వెనుక ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు? లేకపోతే మైనర్లు బెదిరింపుల వెనుక కారణమేంటి? ఇలా అనేక విషయాలు వెలుగులోకి రానున్నాయి. ఒక్కసారి వారం రోజుల వెనక్కి వెళ్తే.. ఏప్రిల్ 27న మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఇళ్లు దోపిడికీ విఫలయత్నం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఇద్దరు దొంగలు కత్తులతో మాజీ మంత్రి ఇంట్లోకి ప్రవేశించారు. వాచ్‌మేన్‌పై దాడి చేసి ఆయన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకోవాలని భావించారు ఆ దొంగలు.


ALSO READ: హమ్మయ్య.. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఏపీలో భారీ వర్షం

వాచ్‌మేన్ కేకలు వేయడంతో గదిలో నిద్రిస్తున్న గన్‌మెన్ అలర్టయి బయటకు రావడంతో ఇద్దరు దుండగులు పరారయ్యారు. ఆ తర్వాత ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడం కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టడం జరిగిపోయింది. ఈ ఘటన జరిగి సరిగ్గా వారం రోజులకే మైనర్లు లేఖ రావడం కలకలం రేపుతోంది. మరి ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతారా? ఎన్నికల వేల బిజీ అని ఈ కేసు పక్కనబెడతారా అనేది చూడాలి.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×