BigTV English

Road Accident : రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

Road Accident : రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

Road Accident In Rajasthan: రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సవాయ్ మధోపూర్ హైవేపై కారును గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందగా..మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.


ఆలయ దర్శనానికి  ఓ కుటుంబం కారులో వెళ్తున్న సమయంలో సవాయ్ మాధోపూర్ హైవేపై ఆకస్మాత్తుగా వచ్చిన  గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటన ఢిల్లీ -ముంబై హైవేపై ఆదివారం జరగగా..కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో ఒకే కుటంబానికి చెందిన ఆరుగురు మృతి చెందగా..ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు జైపూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత మృతదేహాలను బయటకు తీయడం కోసం చాలా శ్రమించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.


Also Read: పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. విదేశాల నుంచి మెయిల్స్..!

మృతుల బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మనీష్ శర్మ, అతని భార్య అనిత, కైలాష్ శర్మ, అతని భార్య సంతోష, సతీష్ శర్మ , పూనమ్ లతో సహా ఆరుగురు మృతి చెందినట్లు బోన్లీ పోలీస్ అధికారులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా? లేక ఏదైనా భారీ వాహనం ఢీ కొట్టిందా.. అన్న కోణంలో విచారిస్తున్నట్లు వెల్లడించారు.

Tags

Related News

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

Big Stories

×