E-Paper
Advertisement

Ayurvedic Doctor Attended 8th Class Exams: 84 సంవత్సరాల వయసులో 8వ తరగతి పరీక్షలు రాస్తున్న ఆయుర్వేద వైద్యుడు..

Ayurvedic Doctor Attended 8th Class Exams: 84 సంవత్సరాల వయసులో 8వ తరగతి పరీక్షలు రాస్తున్న ఆయుర్వేద వైద్యుడు..
Advertisement

84 – Year Old Man attended 8th Class Exams: ఆయనొక ఆయుర్వేద వైద్యుడు. అతని వయస్సు 84 సంవత్సరాలు. ఆయుర్వేద వైద్యంలో ఆయనకు మంచి పట్టు ఉంది. చాలామంది ప్రముఖులకు కూడా ఆయన ఆయుర్వేద వైద్యం చేశారు. ఇప్పుడాయన 8వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఇంతకుముందుకు ఆయన ఐదో తరగతి పరీక్షలు కూడా రాశారు. తరువాత పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తానని చెబుతున్నారు.

మధ్యప్రదేశ్ లోని ఛింద్ వాడాకు చెందిన ప్రకాశ్ ఇండియన్ టాటా అనే వ్యక్తి ఆయుర్వేద వైద్యుడు. 84 ఏళ్ల వయస్సున్న అతను ప్రస్తుతం 8వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘చదువుకు వయస్సుతో సంబంధం లేదు. అందుకే నేను మధ్యప్రదేశ్ ఓపెన్ బోర్డ్ నిర్వహిస్తున్న 8వ తరగతి పరీక్షలు రాస్తున్నాను. గతంలో కూడా ఐదో తరగతి పరీక్షలు రాశాను. 8వ తరగతి పరీక్షల తరువాత 10, ఇంటర్ పరీక్షలు కూడా రాస్తాను’ అని ప్రకాశ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

84 - Year Old Illiterate Ayurvedic Doctor
84 – Year Old Illiterate Ayurvedic Doctor
Advertisement

Also Read: పూణె యాక్సిడెంట్‌లో కొత్త నిజాలు, ఇద్దరు డాక్టర్లు అరెస్ట్, ఏం జరిగింది?

ఆయుర్వేదంలో మంచి పట్టు సంపాదించిన ప్రకాశ్.. సామాన్యుల నుంచి ప్రముఖులకు కూడా ఆయుర్వేద సేవలు అందిచారు. అమితాబ్ బచ్చన్ వంటి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర దేశాలకు చెందిన వ్యాపారవేత్తలకు కూడా ఆయన సేవలు అందిచారు. అంతేకాదు.. ఆయన ఇప్పటివరకు 112 దేశాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు కూడా ఆయుర్వేద సేవలు అందించినట్లు తెలుస్తోంది.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×