BigTV English

Twist in Pune Porsche Car Accident: పూణె యాక్సిడెంట్‌లో కొత్త నిజాలు.. ఇద్దరు డాక్టర్లు అరెస్ట్.. ఏం జరిగింది..?

Twist in Pune Porsche Car Accident: పూణె యాక్సిడెంట్‌లో కొత్త నిజాలు.. ఇద్దరు డాక్టర్లు అరెస్ట్.. ఏం జరిగింది..?

New Twist in Pune Porsche Car Incident: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది పూణెలో జరిగిన పోర్ష్ కారు యాక్సిడెంట్ వ్యవహారం. ఇప్పుడు ఈ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇద్దరు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో తీగ లాగితే ఈ కేసులో డొంక కదులుతోంది. సానూన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అజేయ్ తావ్రే, డాక్టర్ శ్రీహరి హార్నూర్‌లను అరెస్ట్ చేసి తనదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు.


తాజాగా ఫోరెన్సిక్ పరీక్షలు చేసే డాక్టర్లు రక్త నమూనాలు తారుమారు చేయడంతో ఈ కేసు కొత్త టర్న్ అయ్యింది. నిందితుడు మైనర్ రక్త నమూనాలను పక్కన పెట్టేసి, మరో వ్యక్తి నమూనాలను రిపోర్టులో పొందిపరిచారట డాక్టర్లు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ అజయ్ టవ్రే కాగా, మరొకరు ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీహరి ఇందులో కీలకపాత్ర పోషించారు. ఈ లెక్కన ఘటన జరిగిన సమయంలో కారులో మైనర్ ఒక్కడే ఉన్నాడా? ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు రెట్టింపయ్యాయి.

నిందితుడు తండ్రి ఫేమస్ రియల్టర్ కావడంతో ఈ కేసు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చకచకా జరిగి పోయాయి. నిజం ఎక్కడైనా తెలుస్తుందనే దానికి ఇదో ఎగ్జాంపుల్. మైనర్ కొడుకును రక్షించేందుకు ఫ్యామిలీ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. తొలుత ఈ కేసులో వాళ్ల కారు డ్రైవర్‌ను ఇరికించేందుకు మైనర్ తండ్రి, తాత తీవ్రంగా కృషి చేశారు. ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో డైరెక్ట్‌గా డాక్టర్లతో మంతనాలు చేశారు. టీనేజర్ తండ్రి, తాతను పోలీసులు అరెస్ట్ చేశారు.


Also Read: వారంలో చెన్నై ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం, ఈ మెయిల్స్ బెదిరింపులు

ఇంటర్ రిజల్ట్ తర్వాత ఈనెల 19న పూణెలో మైనర్ బాలుడు, ఓ బార్‌లో తన ఫ్రెండ్స్ కలిసి పార్టీ చేసుకున్నాడు. అయితే బాలుడు ఫోర్షే కారుతో తెల్లవారుజామున ఇంటికి వస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఆ బాలుడు అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ బైక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు సాప్ట్‌వేర్ ఇంజనీర్లు మృతి చెందారు. అయితే ఘటన జరిగి గంటల వ్యవధిల్లోనే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో బెయిల్‌ని వెనక్కి తీసుకుంది కోర్టు. మైనర్‌ను జూన్ ఐదు వరకు అబ్జర్వేషన్‌కు పంపిన విషయం తెల్సిందే.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×