E-Paper
Advertisement

Jharkhand: బార్‌లో ‌‌వాగ్వాదం.. వ్యక్తిని కాల్చి చంపిన దుండగుడు!

Jharkhand: బార్‌లో ‌‌వాగ్వాదం.. వ్యక్తిని కాల్చి చంపిన దుండగుడు!
Advertisement

Jharkhand: అర్ధరాత్రి ఒంటి గంటకు మద్యం సరఫరా చేయడానికి నిరాకరించిన బార్ సిబ్బంది ఒకరిని తుపాకీతో కాల్చి చంపిన సంఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది. రాంచీలోని ఓ బార్ లోకి వచ్చిన నలుగురు దుండగుల్లో ఓ వ్యక్తి తుపాకీతో డీజేను కాల్చి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

రాంచీలొని ఓక్స్ ట్రీమ్ స్పోర్ట్స్ బార్‌లోకి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చారు. అప్పటికే బార్ మూసి ఉంది. వచ్చిన నలుగురు మద్యం సప్లై చేయాలని సిబ్బందిని అడిగారు. దానికి సిబ్బంది నిరాకరించడంతో బార్ సిబ్బందికి వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే బార్ లో రోజువారీ జీతానికి పని చేస్తున్న సందీప్ అనే డీజేపై ఓ దుండగుడు కాల్పులు జరిపారు.

Advertisement

దుండగుడు ముఖం కనిపించకుండా టీ షర్ట్ ధరించి అతి దగ్గర నుంచి సందీప్ ను కాల్చాడు. దీంతో అక్కడే ఆ వ్యక్తి కుప్పకూలిపోయాడు. అనంతరం నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. అయితే సందీప్ ను అక్కడ ఉన్న వారు వెంటనే ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు.

Also Read: బ్లాక్ మెయిల్ చేస్తూ బాలుడిపై అత్యాచారం.. బ్లాక్ మెయిలర్ ను హత్య చేసిన బాధితుడు

Advertisement

అయితే ఈ ఘటనకు సంబంధించిన సీసీపుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై రాంచీ ఎస్పీ చందన్ కుమార్ మిశ్రా కూడా మీడియాతో మాట్లాడారు. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ కారణంగా హత్య జరిగినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఫోరెన్సిక్ ల్యాబ్ కు చెందిన నిపుణులు ఘటనా స్థలంలో ఆధారాలకు సేకరించారు. అయితే కాల్పులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చూసిన వారు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. పోలీసులు ఉదాశీన వైఖరికి కాల్పలు కారణం నిదర్శనం అని చెబుతున్నారు. రాంచీలో చాలా సార్లు బార్లు అర్థరాత్రి 2 నంచి 3 గంటల వరకూ తెరిచే ఉంటాయని చెబుతున్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×