E-Paper
Advertisement

Rs 900 Crore Gold Seized: సంచలనం.. ఎన్నికల వేళ తమిళనాడులో 1425 కేజీల బంగారం సీజ్..!

Rs 900 Crore Gold Seized: సంచలనం.. ఎన్నికల వేళ తమిళనాడులో 1425 కేజీల బంగారం సీజ్..!
Advertisement

Rs. 900 Crore Gold Seized in Tamil Nadu During the Elections: ఎన్నికల వేళ నగదు, నగల ప్రవాహాన్ని కంట్రోల్ చేసేందుకు దృష్టి సారించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని ఆపాల్సిందేనని భావించింది. అన్నట్లుగా చెక్ పోస్టులను భారీగా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్లయింగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించింది. తాజాగా తమిళనాడులో భారీ ఎత్తున పసిడి పట్టుబడింది. ఒక్కరోజులో దాదాపు 1025 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు.

తొలుత మిని లారీ, మినీ కంటెయినర్లను సోదాలు చేశారు పోలీసులు. ఓ లారీలో దాదాపు 1025 కేజీ గోల్డ్  పట్టుబడింది. మరో వాహనంలో 400 కేజీల బంగారాన్ని గుర్తించారు. ఈ బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్టు నుంచి శ్రీపెరుంబుదూర్ సమీపంలోకి ఓ గోడౌన్‌కు తరలిస్తున్నట్లు తేలింది. అయితే 400 కేజీల బంగారానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అయితే లారీలో స్వాధీనం చేసుకున్న బంగారానికి సంబంధించిన ఆధారాలు లేనట్లు సమాచారం. వీటి విలువ మార్కెట్‌లో 900 కోట్ల రూపాయలుగా ఉంటుందని అధికారుల అంచనా.

Advertisement

Also Read: ECI Says 4650 crore seized: ఈసీ ప్రకటన.. డ్రగ్స్‌దే అగ్రస్థానం, ఏపీలో 125 కోట్లు

కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ రహదారిపై ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాల తనిఖీల్లో ఈ బంగారం వ్యవహారం బట్టబయలైంది. దీంతో తమిళనాడు అంతటా ఫ్లయింగ్ స్క్వాడ్‌లను మెహరించారు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి. మరో నాలుగురోజుల్లో లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని 39 నియోజక‌వర్గాలు ఈ ఫేజ్‌లోనే ఉన్నాయి. పోలింగ్‌కు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో అక్కడ ప్రతీ వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ కూత మొదలు ఇప్పటికే అత్యధిక బంగారం పట్టుబడింది కేవలం దక్షిణాదిలో మాత్రమే.

Tags

Related News

Sonam Bail: హనీమూన్​ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితురాలికి కోర్టు రెండు ఆప్షన్లు..?

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

Big Stories

Advertisement
×