BigTV English

Surya’s Kanguva New Poster: ‘కంగువ’ నుండి స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్.. స్టోరీ ఎలా ఉండబోతుందో తెలిసిపోయింది?

Surya’s Kanguva New Poster: ‘కంగువ’ నుండి స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్.. స్టోరీ ఎలా ఉండబోతుందో తెలిసిపోయింది?

Suriya Double Role in Kanguva Movie: ఈ ఏడాది బడా హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, సూర్య వంటి స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.


ఈ హీరోలు నటించే సినిమాల నుంచి తరచూ ఏదో ఒక అప్డేట్ వస్తూ ప్రేక్షకాభిమాల్లో అంచనాలు పెంచేస్తుంది. అయితే తాజాగా ఓ బడా హీరో సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఆ బడా హీరో మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ప్రస్తుతం సూర్య నటిస్తోన్న కొత్త మూవీ ‘కంగువ’. తమిళ న్యూ ఇయర్ ‘పూతండు’ సందర్భంగా ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు.

ఈ మేరకు ‘కంగువ’ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్ చూస్తుంటే చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ పోస్టర్‌లో కత్తిపట్టిన యుద్ధ వీరుడు కంగువ, మోడరన్ వారియర్‌గా ఉన్న సూర్య స్టిల్ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్‌పై మంచి రెస్పాన్స్ వస్తుండగా.. మరో ఆలోచన నెటిజన్లలో మెదిలింది.


Also Read: ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే..?

గతం, వర్తమానం ఢీకొంటే కొత్త భవిష్యత్ స్టార్ట్ అవుతుంది అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో సినీ ప్రియులు, అభిమానులు గతం, వర్తమానం అంటే.. టైం ట్రావెల్ కథనా? అంటూ చర్చించుకుంటున్నారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు శివ ఎలా తీస్తాడో.. అసలు పాస్ట్, ప్రజెంట్‌ను ఎలా కలుపుతాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ పోస్టర్‌తో మరింత హైప్ క్రియేట్ అయింది. దర్శకుడు శివ పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తుంది. అలాగే బాబీ డియోల్ ఇందులో ముఖ్య కీలక పాత్ర చేస్తున్నాడు. దాదాపు 10 భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్రీడిలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×