Big Stories

ECI Says 4650 crore seized: ఈసీ ప్రకటన.. డ్రగ్స్‌దే అగ్రస్థానం, ఏపీలో 125 కోట్లు

ECI Says 4650 crore seized: దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కోడ్ కూత మొదలు ఇప్పటివరకు భారీ స్థాయితో నగదు, నగలు పట్టుబడ్డాయి. అయితే ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడడం సంచలనం రేపుతోంది. ఈ విషయం తెలిసి అధికారులకే షాకయ్యారు. దేశంలో చాప కింద నీరుగా డ్రగ్స్ విస్తరిస్తోందన్నది ముమ్మాటికీ నిజం.

- Advertisement -

సార్వత్రిక ఎన్నికలు తొలి దశ ముందే రికార్డు క్రియేట్ చేసింది. తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు రికార్డు స్థాయిలో అంటే 4650 కోట్ల విలువైన నగదు, నగలు, డ్రగ్స్ స్వాధీనం చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. 2019తో పోల్చితే ఇది చాలా ఎక్కువని వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో సీజ్ చేసిన సందర్భాలు లేవని పేర్కొంది. రోజుకు సగటున 100 కోట్ల రూపాయలు పట్టుబడినట్టు చెబుతోంది.

- Advertisement -

ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘం, భారీ ఎత్తున తనిఖీలు, ఫ్లయింగ్ స్వ్కాడ్‌లను మోహరించింది. నగదు రూపంలో రూ. 395.39 కోట్లు, బంగారం – ఇతర విలువైన లోహాల రూపంలో రూ. 562.10 కోట్లు పట్టుబడ్డాయి. మద్యం రూపంలో రూ. 489.31 కోట్లు విలువ చేసే 3.58 కోట్ల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుంది.

ఇక డ్రగ్స్ రూపంలో అత్యధికంగా రూ. 2,068.85 కోట్ల రూపాయలున్నట్లు చెబుతోంది. అంటే దాదాపు 45శాతమన్నమాట. బహుమతుల రూపంలో రూ. 1,142.49 కోట్లు ఈ జాబితాలో ఉన్నాయి. మార్చి ఒకటి నుంచి ఇవాళ్టి వరకు సగటున రోజుకు రూ. 100 కోట్ల మేరా పట్టుబడింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయాని కొస్తే.. తెలంగాణ నుంచి రూ. 121.84 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 125.97 కోట్లు స్వాధీనం చేసుకుంది. మరి ఎన్నికలు పూర్తి అయ్యేనాటికి ఈ లెక్క ఈ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News