BigTV English

Arvind Kejriwal to Supreme Court: బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే.. సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్..

Arvind Kejriwal to Supreme Court: బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే.. సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్..

Arvind Kejriwal Moves Supreme Court in Delhi Liquor Scam Bail: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఉదయం విచారణ చేపట్టాలని ఢిల్లీ సీఎం తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.


మార్చి 21న ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గత గురువారం ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ కార్యకర్తలు, నేతలు శుక్రవారం కేజ్రీవాల్ విడుదలవుతారని భావించారు. కానీ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం ఉదయమే దర్యాప్తు సంస్థ ఈడీ ట్రయిల్ కోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ట్రయిల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.

ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ తన పిటిషన్‌లో, దేశంలో స్థిరపడిన న్యాయ ప్రక్రియ, సంప్రదాయాన్ని విస్మరిస్తూ బెయిల్ ఆర్డర్‌పై హైకోర్టు స్టే విధించిందని పేర్కొన్నారు. ఈ విషయంలో, దేశంలోని న్యాయం, బెయిల్ ప్రాథమిక సూత్రాలు ఉల్లంఘించారంటూ పేర్కొన్నారు. కేంద్రంలోని అధికార పార్టీని విమర్శించే వ్యక్తిగా ఉండటం వల్ల ఈడీ అసంతృప్తికి, వివక్షపూరిత ప్రక్రియకు తాను బలి అయ్యానని రాజకీయ కోణాన్ని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు.


Also Read: సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు

దిగువ కోర్టు ఆదేశాలను సమీక్షించేటప్పుడు హైకోర్టు కూడా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు ఒక్కరోజు కూడా నిర్వహణలో ఉండటానికి వీళ్లేదని.. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. కాబట్టి, కేజ్రీవాల్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×