E-Paper
Advertisement

Air Ambulance Crash: జార్ఖండ్‌‌లో ఘోర ప్రమాదం.. కూలిన ఎయిర్ అంబులెన్స్, వారంతా మృతి

Air Ambulance Crash: జార్ఖండ్‌‌లో ఘోర ప్రమాదం.. కూలిన ఎయిర్ అంబులెన్స్, వారంతా మృతి
Advertisement

Air Ambulance Crash: జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో ఎయిర్ అంబులెన్స్ కూలిపోయింది. ఈ ఘటనలో అందులోని ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ అంబులెన్స్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఏటీసీతో సంబంధాలు కోల్పోయాయి. ఫలితంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇంతకీ జార్ఖండ్ నుంచి ఢిల్లీకి ఎయిర్ అంబులెన్స్ ఎందుకు వెళ్తోంది.

జార్ఖండ్‌‌లో ఘోర ప్రమాదం.. కూలిన ఎయిర్ అంబులెన్స్

Advertisement

రెడ్‌ బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బీచ్‌ క్రాఫ్ట్ C-90 విమానం అది. కాలిన గాయాలతో ఉన్న 41 ఏళ్ల సంజయ్‌కుమార్‌‌ని ట్రీట్‌మెంట్ కోసం జార్ఖండ్ రాజధాని రాంచీ నుండి రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీకి తరలిస్తున్నారు. ఎయిర్ అంబులెన్స్ టేకాఫ్ అయిన 23 నిమిషాల తర్వాత అది రాడార్‌తో సంబంధాన్ని కోల్పోయింది. చత్రా జిల్లా సిమరియా వద్ద అటవీ ప్రాంతంలో ఒక్కసారి కుప్పకూలింది.

ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 10 గంటలకు ఆ విమానం ఢిల్లీ చేరుకోవాల్సి ఉండగా అంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఎయిర్‌ అంబులెన్సులో పేషెంట్‌తోపాటు డాక్టర్, పారామెడికల్‌ ఉద్యోగి, ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Advertisement

ఎయిర్ అంబులెన్స్‌లో ఏడుగురు మృతి

ఎయిర్ అంబులెన్స్‌లో  పేషెంట్  41 ఏళ్ల సంజయ్ కుమార్ ఉన్నాడు. డాక్టర్ వికాష్ కుమార్ గుప్తా, పారామెడికల్ సిబ్బంది సచిన్ కుమార్ మిశ్రా, పేషెంట్స సహాయకులు అర్చన దేవి, ధురు కుమార్, ఇద్దరు పైలట్లు  కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కో-పైలట్ సావ్రాజ్‌దీప్ సింగ్‌గా గుర్తించారు.

పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ సమాచారం మేరకు వారణాసికి ఆగ్నేయంగా దాదాపు 100 నాటికల్ మైళ్ల దూరంలో రాత్రి 7. 34 గంటలకు ఆ విమానానికి రాడార్ సంబంధాన్ని కోల్పోయింది. లతేహార్ జిల్లాలోని చాంద్వా ప్రాంతానికి చెందిన 41 ఏళ్ల సంజయ్ కుమార్.. 65 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్నాడు.

ALSO READ: అవినీతిని ప్రశ్నిస్తే బురద జల్లుతారు.. వేలూర్ సభలో విజయ్ భావోద్వేగం

దేవ్నికా హాస్పిటల్‌లో చేరిన కుమార్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఫిబ్రవరి 16న దేవ్‌కమల్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. అధునాతన చికిత్స కోసం ఆయన్ని ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించాలని కుటుంబం నిర్ణయించింది. ఆసుపత్రి నుంచి సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో డిశ్చార్జ్ అయిన కుమార్‌, అక్కడి నుంచి విమానాశ్రయానికి తరలించారు. అంతలోనే అనుకోని ఘటన చోటు చేసుకుంది.

 

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×