E-Paper
Advertisement

Akasha Air: వామ్మో, ఆ విమానం ఎక్కిన మహిళ.. నడవలేక అవస్థలు, కాళ్లు కుళ్లిపోయి..

Akasha Air: వామ్మో, ఆ విమానం ఎక్కిన మహిళ.. నడవలేక అవస్థలు, కాళ్లు కుళ్లిపోయి..
Advertisement

పరిశుభ్రత లేకపోవడంతో తనకు తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని మహిళ తెలిపింది. దీనిపై ఎయిర్‌లైన్ స్పందించింది. ఈ విషయాన్ని సమీక్షిస్తున్నామని తెలిపింది.

లింక్డ్ ఇన్ పోస్ట్ వైరల్

డిసెంబర్ 26న బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు స్నేహితులతో ప్రయాణించిన జాహాన్వి త్రిపాఠి అనే మహిళ లింక్డ్‌ఇన్‌లో తనకు ఎదురైన పరిస్థితిని పంచుకున్నారు. ఆకాసా విమానం రాత్రి 10:25 గంటలకు బయలదేరిందని, విమానంలో సౌకర్యవంతమైన ప్రయాణం ఉంటుందని ఆశించానన్నారు. కానీ విమానం లోపల అపరిశుభ్రత ఉన్న సీటింగ్ తన ప్రయాణాన్ని బాధాకరంగా మార్చిందన్నారు. సీట్ల అరెంజ్మెంట్ కారణంగా తీవ్రమైన అసౌకర్యం కలిగిందన్నారు. దీంతో తనకు తీవ్రమైన మోకాళ్ల నొప్పి వచ్చిందన్నారు. తన స్నేహితులు కూడా ఇలాంటి అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారన్నారు.

కాళ్లకు ఫంగల్ ఇన్ఫెక్షన్

Advertisement

ప్రయాణం తర్వాత కొద్దిసేపటికే తన కాళ్లకు తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని, అది క్రమంగా తీవ్రమైందని త్రిపాఠి ఆరోపించారు. ఈ పరిస్థితి వల్ల తాను సరిగ్గా నడవలేకపోతున్నానని, నిద్రపోలేకపోతున్నానన్నారు. ప్రస్తుతం వైద్య చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు. ఈ ప్రయాణం తనను శారీరకంగా, మానసికంగా చాలా అలసిపోయేలా చేసిందన్నారు.

విమానంలో అపరిశుభ్రమైన సీటింగ్, క్యాబిన్ పరిస్థితుల కారణంగా తనకు ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చని త్రిపాఠి ఆరోపించారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె ఎయిర్ లైన్స్ ను కోరారు.

ఎయిర్ లైన్స్ ఏమన్నదంటే?

Advertisement

త్రిపాఠి ఆరోపణలపై ఆకాశ ఎయిర్ స్పందించింది. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. తాము ప్రయాణికులకు అత్యున్నత స్థాయి పరిశుభ్రత కస్టమర్ శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఆమెకు జరిగిన అసౌకర్యంపై తక్షణమే సమీక్షించి, వీలైనంత త్వరగా తిరిగి సంప్రదిస్తామని ఎయిర్‌లైన్ తెలిపింది.

Also Read: Ex Mla CPR In Flight: ఇండిగో విమానంలో ప్రయాణికురాలికి అస్వస్థత.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మాజీ ఎమ్మెల్యే

ఈ ఘటన ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. కొంతమంది విమానంలో అపరిశుభ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు విమానం ప్రయాణం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందనే వాదనను ప్రశ్నించారు. విమాన క్యాబిన్లు పూర్తి పరిశుభ్రతతో ఉంటాయని, ఇన్ ఫెక్షన్లు సోకే అవకాశం ఉండదని అంటున్నారు.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×