Itlu Me Yedava OTT : కొత్త ఏడాది థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు ఎక్కువగా విడుదలవుతున్నాయి. తాజాగా మరో ఫ్లాప్ మూవీ ఆ లిస్ట్ లో చేరింది. ఆ మూవీనే ‘ఇట్లు మీ ఎదవ’. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ మూవీ ఏ ఓటీటీలో, ఎప్పుడు రాబోతోంది ? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.
త్రినాథ్ కఠారి కథానాయకుడిగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఇట్లు మీ ఎదవ'(Itlu Me Yedava). ‘వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు’ అనే ఉపశీర్షికతో ఈ మూవీని విడుదల చేశారు. ఇందులో సాహితీ అవాంచ కథానాయికగా నటించగా, హీరోగా చేసిన త్రినాథ్ కఠారి స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గోపరాజు రమణ, దేవి ప్రసాద్, సురభి ప్రభావతి, మధుమణి, తనికెళ్ళ భరణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ఈ మూవీ నవంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. కానీ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఇబ్బందుల్లో పడింది. చాలా రోజులు ఎదురు చూశాక నిర్మాతలు మూవీ డిజిటల్ డీల్ ను ఫైనల్ చేసుకున్నట్టు సమాచారం. అందులో భాగంగానే 2026 జనవరి 15 నుండి మూవీ స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. ఇది ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీలో ప్రీమియర్ కానుంది. నిజానికి OTT హక్కుల విషయంలో సరైన డీల్ రాక ఇబ్బంది పడుతున్న తక్కువ బడ్జెట్ చిత్రాలకు ఈటీవీ విన్ వరంలా మారింది. థియేటర్లలో గుర్తింపు పొందకుండా పోయిన ఎన్నో చిత్రాలు ఓటీటీలో మాత్రం మంచి సక్సెస్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు ‘ఇట్లు మీ ఎదవ’ మూవీ విషయంలో కూడా జరిగింది. మరి ఈ మూవీకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.
Read Also : పెళ్లయ్యాక భార్య అమ్మాయి కాదని తెలిస్తే… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ భయ్యా
మచిలీపట్నంలో ఉండే శ్రీను బాబు (త్రినాథ్ కఠారి) చుట్టూ తిరుగుతుంది స్టోరీ. ఆరేళ్లుగా పీజీ చేస్తూనే ఉండే మన హీరో ఒక్కసారి కూడా పాస్ అనే మాటకు దగ్గరగా కూడా వెళ్లడు. పీజీ రెండో ఏడాదిచదువుతూ ఉంటాడు. తన క్లాసులోనే మనస్విని (సాహితీ అవాంచ) అనే అమ్మాయి జాయిన్ అవుతుంది. ఆమెది కూడా మచిలీపట్నమే కావడం విశేషం. కానీ ఆ పిల్ల తండ్రి సాయి (దేవి ప్రసాద్) బ్యాంకు మేనేజర్. దీంతో హీరోయిన్ కుటుంబం వివిధ ప్రాంతాల్లో తిరిగి చివరకు సొంతూరుకు వచ్చి చెరతారు. మనస్వినికి దేవుడంటే భయం, భక్తి. కానీ శ్రీను బాబుకు మాత్రం అసలు భక్తి అంటే ఏంటో తెలియదు. కానీ ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డ శ్రీను ఎలాగైనా పడేయాలని డిసైడ్ అవుతాడు. అందులో భాగంగా పెద్ద భక్తుడి అవతారం ఎత్తుతాడు. హీరోయిన్ కూడా ఇంప్రెస్ అయ్యి, అతని ప్రేమలో పడుతుంది. కొడుకు ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోతుంది. హీరో తండ్రి హీరోయిన్ ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళతాడు. కానీ ఈ సీన్ తో హీరోయిన్ ఇంట్లో చిన్న గొడవ జరుగుతుంది. దీంతో హీరోయిన్ తండ్రిని ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. ఇంతకీ హీరోయిన్ తండ్రికి ఏమైంది? చివరకు శ్రీను, మను ఒక్కటయ్యారా ? లేదా ? అనేది తెరపై చూడాల్సిందే.