E-Paper
Advertisement

Akhilesh Yadav: మోదీ సర్కార్ కూలడం ఖాయం: అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: మోదీ సర్కార్ కూలడం ఖాయం: అఖిలేష్ యాదవ్
Advertisement

Akhilesh Yadav: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారం చలాయించేది కొద్ది రోజులేనని అన్నారు. బెంగాల్ ప్రజలు బీజేపీతో పోరాడి ఆ పార్టీని వెనక్కి నెట్టారని అన్నారు. యూపీలోనూ ఇదే జరుగుతుందని వ్యాఖ్యానించారు. కోల్‌కతాలో ఆదివారం జరిగిన టీఎంసీ ర్యాలీలో అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో కొలువుదీరిన కాషాయ పార్టీ పాలకులు అధికారంలో ఉండేది కొద్ది రోజులేనని అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ సర్కార్ నడిచేది కాదని, పడిపోయే ప్రభుత్వమేనని ఆరోపించారు. ఇదిలా ఉంటే ఎన్నికైన ఎంపీల్లో 38 శాతం మంది మహిళలున్న ఏకైక పార్టీ తృణముల్ కాంగ్రెస్ పార్టీయేనని సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాజకీయాల్లో మహిళలు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నికలకు ముందు చెప్పినా ఆ దిశగా ఎవరూ అడుగులు వేయలేదని ఆరోపించారు. 38 శాతం మహిళా ప్రతినిధ్యం ఉండేలా చర్యలు చేపట్టింది కేవలం తమ పార్టీ మాత్రమే అని మమతా బెనర్జీ అన్నారు.

Advertisement

Also Read: బంగ్లాదేశ్ సంక్షోభంపై బెంగాల్ సీఎం దీదీ కీలక వ్యాఖ్యలు

టీఎంసీ ర్యాలీని ఉద్ధేశించి ఆమె మాట్లాడుతూ.. బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో అఖిలేష్ సాధించిన ఫలితాలకు తాను ఆయనకు ధన్యవాదాలు చెబతున్నానన్నారు. యూపీలో మీరు ఇచ్చిన షాక్‌కు కాషాయ పార్టీ రాజీనామా చేయాల్సి ఉంది. కానీ వారు నిస్సుగ్గుగా పదవుల్లో కొనసాగుతున్నారని ఆరోపించారు. కేంద్ర ఏజెన్సీలతో సహా వీలైనంతంగా అన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదని అన్నారు. అంతే కాకుండా ఉత్తర బెంగాల్‌లో తాము మెరుగైన ఫలితాలు రాబట్టలేకపోయామని చెప్పారు. అంతే కాకుండా రానున్న రోజుల్లోఅదే స్థానంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Related News

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

Big Stories

Advertisement
×