Arvind Kejriwal Tears: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో మాజీ సీఎం అరవింత్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలను నిర్ధోషులుగా ప్రకటించింది రౌస్ అవెన్యూ కోర్టు. న్యాయస్థానం నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతుండగా అరవింద్ కేజ్రీవాల్ కంటతడి పెట్టారు. ఆయన్ని ఓదార్చడం మనీశ్ సిసోడియా వంతైంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేతలకు బిగ్ రిలీఫ్
నిజం అనేది ఆలస్యంగా బయటపడుతుంది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అదే జరిగింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో విచారణ జరిపింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఈ మేరకు శుక్రవారం తీర్పు వెల్లడించింది.
నిందితులపై నమోదు చేసిన కేసులను కొట్టి వేసింది. వారందరి పేర్లను డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొంది. సరైన ఆధారాలు లేకుండా కేసులో వారి పేర్లు ఎలా చేర్చారంటూ సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. అంతేకాదు అభియోగాలు మోపిన 22 మంది ఈ కేసు నుంచి విముక్తి కలిగింది.
న్యాయస్థానం తీర్పు తర్వాత కంటతడి పెట్టిన మాజీ సీఎం కేజ్రీవాల్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేసుల్లో ఢిల్లీ లిక్కర్ కేసు ఒకటి. ఢిల్లీ ఎన్నికల ముందు ఈ కేసులో అప్పటి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లు ఆయన జైలు నుంచి పాలన చేశారు. ఈ వ్యవహారంలో ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆయనతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అరెస్టయ్యారు. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది.
న్యాయస్థానం తీర్పు తర్వాత బయటకు వచ్చారు మాజీ సీఎం కేజ్రీవాల్. మీడియా ముందుకొచ్చిన ఆయన .. రెండు మాటలు మాట్లాడుతూ ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. పక్కనే ఉన్న మనీష్ సిసోడియా ఆయన్ని ఓదార్చుతూ ఆలింగనం చేసుకుంటూ కనిపించారు. ఈ కేసు స్వతంత్ర భారతదేశంలో తనపై జరిగిన అతిపెద్ద రాజకీయ కుట్రగా ఆయన వర్ణించారు. నా జీవితంలో నిజాయితీ తప్ప.. తాను సంపాదించింది ఏమీ లేదన్నారు.
ALSO READ: అసెంబ్లీలో అడ్డంగా బుక్కైన ఆ మంత్రి.. వీడియో వైరల్
బీజేపీ తనపై తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు. న్యాయస్థానం ఇదే విషయాన్ని ప్రస్తావించిందన్నారు. బీజేపీ అబద్ధాలన్నీ ఇవాళ బయటపడ్డాయని అన్నారు. నిజం గెలిచింది.. న్యాయ వ్యవస్థపై తనకు మొదటి నుంచి నమ్మకం ఉందన్నారు. మా పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అదే కేసులో మనీష్ సిసోడియాకు విముక్తి కలిగింది. న్యాయస్థానం నిర్ణయంతో ఆప్ నాయకత్వానికి పెద్ద ఉపశమనం కలిగింది.
మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టిన అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal breaks down in tears while talking to the media https://t.co/NAWSbGGIwp pic.twitter.com/LQLSNkf3hF
— BIG TV Breaking News (@bigtvtelugu) February 27, 2026