E-Paper
Advertisement

Mohammad Amir : మీ దేవుడు దిగివ‌చ్చినా టీమిండియా సెమీ ఫైన‌ల్ కు రాదు..ఇది రాసిపెట్టుకోండి

Mohammad Amir : మీ దేవుడు దిగివ‌చ్చినా టీమిండియా సెమీ ఫైన‌ల్ కు రాదు..ఇది రాసిపెట్టుకోండి
Advertisement

Mohammad Amir :  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో టీమిండియా ( India) సెమీ ఫైనల్ చేరాలంటే మరొక్క మ్యాచ్ గెలవాల్సి ఉంది. గురువారం రోజున జింబాబ్వేను చిత్తు చేసి సెమీ ఫైనల్ ఆశలను రేకెత్తించింది టీమిండియా. ఎలాగూ వెస్టిండీస్ పైన చివరి మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందని అంటున్నారు. అయితే టీమిండియా సెమీ ఫైనల్ వెళ్తుందని అందరూ అంటుంటే పాకిస్తాన్ మాత్రం విషం కక్కుతోంది. టీమిండియా సెమీ ఫైనల్ చేరబోదని ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగానే మహమ్మద్ అమీర్ ( Mohammad Amir ) కూడా ఈ అంశంపై స్పందించారు. తలకిందులుగా తపస్సు చేసినా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ లోకి ( semi finals) టీమిండియా రాబోదని మహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహమ్మద్ అమీర్ ఈ వ్యాఖ్యలు చేసి, పెంటపెట్టాడు. అయితే మహమ్మద్ అమీర్ చేసిన ఈ స్టేట్మెంట్ పై ఇండియన్ ఫాన్స్ సీరియస్ అవుతున్నారు.

Also Read: India Semifinal Qualification Scenario: వెస్టిండీస్ తో జ‌రిగే మ్యాచ్ కు వ‌ర్షం గండం ? టీమిండియా సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతేనా !

మీ దేవుడు దిగివ‌చ్చినా టీమిండియా సెమీ ఫైన‌ల్ కు రాదు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు జరుగుతున్నాయి. అయితే నిన్న జింబాబ్వే వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ కీలక మ్యాచ్ లో టీమిండియా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియా సెమీ ఫైనల్ వెళ్లాలంటే ఒక్క మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది. అది కూడా వెస్టిండీస్ పై ఆడనుంది. ఈ మ్యాచ్ టీమ్ ఇండియా కచ్చితంగా క్లియర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇలాంటి నేపథ్యంలో మహమ్మద్ అమీర్ ( Mohammad Amir ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేవుడు దిగువచ్చినా కూడా టీమిండియా సెమీ ఫైనల్ కు చెర‌బోద‌ని బాంబు పేల్చారు. టీమిండియా అలాగే జింబాబ్వే ఇంటికి వెళ్తాయని… వెస్టిండీస్ అటు దక్షిణాఫ్రికా సెమీఫైనల్ లోకి దూసుకు వస్తాయని పేర్కొన్నారు. మార్చి ఒకటవ తేదీన జరిగే మ్యాచ్ లో వెస్టిండీస్ చేతిలో టీమ్ ఇండియా చిత్తుగా ఓడుతుందని కూడా వెల్లడించారు. దీంతో టీమిండియా ఇంటికి వెళ్లడం గ్యారెంటీ అంటూ విషం కక్కాడు మహమ్మద్ అమీర్.

టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే ఎలా ?

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే మరొక మ్యాచ్ గెలవాలి. సూపర్ 8 లో భాగంగా మొదటి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా… ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంది. నిన్న చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో జింబాబ్వేను చిత్తు చేసింది. ఇందులో విజయం సాధించిన టీమిండియా.. సెమీ ఫైనల్ అవకాశాలను మరింత పెంచుకుంది. మార్చి 1వ తేదీన వెస్టిండీస్ తో టీమ్ ఇండియా తలపడనుంది. ఇందులో గెలిస్తేనే టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు వెళుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారితే.. వెస్టిండీస్ సెమీ ఫైనల్ కు వెళుతుంది. టీమిండియా కంటే మెరుగైన రన్ రేట్ వెస్టిండీస్ ఖాతాలో ఉంది. అందుకే వెస్టిండీస్ కు అవకాశం ఎక్కువ.

Advertisement

Also Read: Daisy Shah On Palash: పలాష్ ముచ్చల్ చాలా మంచోడు..స్మృతినే కిలాడీ లేడీ ?..బాలీవుడ్ నటి సంచ‌ల‌నం !

 

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×