E-Paper
Advertisement

PM Modi: పీఎం మోదీతో బంగ్లా ప్రధాని ద్వైపాక్షిక చర్చలు

PM Modi: పీఎం మోదీతో బంగ్లా ప్రధాని ద్వైపాక్షిక చర్చలు
Advertisement

PM Modi: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సమగ్ర భాగస్వామ్యం ఒప్పందం దిశగా చర్చలు ప్రారంభిచాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో చర్చల అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అన్ని రంగాల్లో రెండు దేశాల సంబంధాలను మరింత విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని నిశ్చయించినట్లు తెలిపారు. భారత్‌కు బంగ్లాదేశ్ అతి పెద్ద అభివృద్ధి భాగస్వామి అన్న ప్రధాని బంగ్లాతో సంబంధాలకు మరింత ప్రధాన్యత ఇస్తామన్నారు.

సైనిక సహకారం, ఆయుధాల ఉత్పత్తి, భద్రతా దళాల ఆధునీకరణపై విస్తృతంగా చర్చించినట్లు ప్రధాని తెలిపారు. తమకు నమ్మకమైన మిత్ర దేశం బంగ్లాదేశ్ అని అన్నారు. 1971లో బంగ్లాదేశ్‌కు భారత్‌తో ఏర్పడిన సంబంధాలకు తాము విలువనిస్తామని తెలిపారు. రైల్వేల అనుబంధం, డిజిటల్, మారిటైమ్ రంగాల్లో సహకారం మరింత విస్తరించే దిశగా భారత్, బంగ్లాదేశ్ ఒప్పందాలు చేసుకున్నాయి. హరిత భాగస్వామ్యంపైన కూడా ఒప్పందాలు చేసుకున్నాయి.

Advertisement

Also Read: నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం

గత పదేళ్లలో 1965 కు ముందున్న సంబంధాలను పునరుద్ధరించాం అని ప్రధాని మోదీ తెలిపారు. డిజిటల్, ఇంధన రంగాల్లో సంబంధాలకు మరింత ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. దీంతో రెండు దేశాల మధ్య ఆర్థిక వ్యవస్థలు వేగవంతం అవుతాయని తెలిపారు. అంతే కాకుండా బంగ్లాదేశ్‌లోని సిరాజ్ గంజ్‌లో కంటెయినర్ డిపో నిర్మాణానికి భారత్ మద్ధతునిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Tags

Related News

‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×