BigTV English

Education Ministry: నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం

Education Ministry: నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం

NEET Paper Leak Row: నీట్‌ పేపర్‌ లీకేజ్ అంశంపై కేంద్రం ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఏడుగురు సభ్యులుంటారు. ఇస్రో మాజీ చీఫ్‌ కె.రాధాకృష్ణన్‌.. కమిటీకి అధ్యక్షత వహిస్తారు. ప్రవేశపరీక్షల నిర్వహణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండటం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. రెండు నెలల్లోగా ఈ కమిటీ నివేదికను సమర్పిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.


ఈ కమిటీలో హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్. బి.జె. రావు, ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ కే రామమూర్తి, కర్మయోగి భారత్‌ సహ వ్యవస్థాపకులు పంకజ్‌ బన్సల్‌, ఐఐటీ ఢిల్లీ డీన్‌ ప్రొఫెసర్‌ ఆదిత్య మిత్తల్‌, కేంద్ర విద్యాశాఖ జాయింట్‌ సెక్రటరీ గోవింద్‌ జైశ్వాల్‌ సభ్యులుగా ఉన్నారు.

Also Read: అయోధ్య రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ఠ చేసిన పూజారి కన్నుమూత


నీట్‌, నెట్‌ ప్రశ్నాపత్రాలు లీక్‌ అవడంతో ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ యాక్ట్‌ 2024ను కూడా కేంద్రం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్‌ చేసినా వారిపై చర్యలు తీసుకుంటారు. బాధ్యులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశముంది.

Tags

Related News

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Big Stories

×