E-Paper
Advertisement

Arunachal Pradesh: ఆ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ

Arunachal Pradesh: ఆ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ
Advertisement

Arunachal Pradesh: ఈశాన్య రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి అధిక సీట్లు వచ్చాయి. దీంతో భారతీయ జనతా పార్టీ ముచ్చటగా మూడోసారి ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 60. అందులో మూడింట రెండొంతులకు పైగా స్థానాలను బీజేపీ గెలుచుకుంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. జాతీయ అగ్రనేతలు కూడా రాష్ట్ర నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న రెండు లోక్ సభ స్థానాలు కూడా తమవేనంటూ బీజేపీ సీఎం పెమా ఖండూ, సీనియర్ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

కాగా, దేశంలో 2024 లోక్ సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగగా, ఇందుకు సంబంధించిన ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముంది.. ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నది అంటూ తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు.

Advertisement

Also Read: మోదీ మూడో సారి గెలిస్తే గుండు చేయించుకుంటా: సోమనాథ్

అయితే, ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయి.. దీంతో తామే అధికారంలోకి రాబోతున్నామంటూ ధీమాను వ్యక్తం చేశారు. ఇటు ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. అందులో మాత్రం బీజేపీకి ఎక్కువగా మొగ్గు చూపాయి. వీటిపై స్పందించిన పలువురు నేతలు ఆ ఎగ్జిట్ పోల్స్ సరికావు.. అంతా అబద్ధమంటూ కొట్టిపారేశారు.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×