BigTV English

Somnath Bharti: మోదీ మూడో సారి గెలిస్తే గుండు చేయించుకుంటా: సోమనాథ్

Somnath Bharti: మోదీ మూడో సారి గెలిస్తే గుండు చేయించుకుంటా: సోమనాథ్

Somnath Bharti: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ తెలిపారు. ఒకవేళ మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు చేయించుకుంటానని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని సోమనాథ్ అన్నారు.


ఢిల్లీలోని 7 సీట్లను కూడా ఆప్ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నా మాటలు గుర్తు ఉంచుకోండి.. మోదీ మరోసారి ప్రధాని అయితే నేను గుండు చేసుకుంటా.. అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పని జూన్ 4న రుజువు అవుతుందని సోమనాథ్ చెప్పారు. ఢిల్లీ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి బన్సూరి స్వరాజ్‌పై సోమనాథ్ పోటీ చేశారు.

Also Read: ఈవీఎంలను మార్చేందుకు కుట్ర.. అందుకే ఫేక్ ఎగ్జిట్ పోల్స్: కేజ్రీవాల్


దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధిస్తుందని తెలిపాయి. అయితే వీటిని ఆప్ నేత సోమనాథ్ అంగీకరించలేదు. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని రుజువు అవుతుందని అన్నారు.  ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన బన్సూరీ స్వరాజ్ పై సోమనాథ్ పోటీ చేశారు. కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ కుమార్తె.. బన్సూరీ స్వరాజ్ తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. ఢిల్లీలోని ఏడు స్థానాలు ఇండియా కూటమి దక్కించుకుంటుందని సోమనాథ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతొ బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 350కి పైగా స్థానాలు వస్తాయని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ప్రతిపక్ష పార్టీలతో కూటమిలో ఉన్న ఇండియా కూటమి 150- 170 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా వేశాయి.

Tags

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×