E-Paper
Advertisement

Patna Boat Capsize: గంగా నదిలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు..

Patna Boat Capsize: గంగా నదిలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు..
Advertisement

Boat Capsize in Patna: బీహార్‌లోని పాట్నాలో విషాదం చోటుచేసుకుంది. రాజధాని నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్హ్ పట్టణ సమీపంలోని గంగా నదిలో పడవ బోల్తా పడింది. మొత్తం 17 మంది ఈ పడవలో ప్రయాణిస్తుండగా పడవ బోల్తా పడింది.

దీంతో అందులోని 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన ఆరుగురు గల్లంతైనట్లు సమాచారం. బార్హ్ ఉమానాథ్ ఘాట్ నుండి డయారాకు ప్రయాణిస్తోన్న సమయంలో పడవ బోల్తా పడిందని గల్తంతైన వారికోసం అన్వేషణ జరుగుతోందని అధికారులు తెలిపారు.

Advertisement

గత నెల ప్రారంభంలో బీహార్‌లోని మహావీర్ తోలా గ్రామ సమీపంలో గంగా నదిలో పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు అదృశ్యమైన తర్వాత ఆదివారం ఈ సంఘటన జరిగింది.

Advertisement

ఉమానాథ్ గంగా ఘాట్ సమీపంలో ఉదయం 9.15 గంటలకు ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ప్రయాణిస్తున్న పడవ మార్గమధ్యంలో బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని బార్హ్ సబ్ డివిజనల్ ఆఫీసర్ శుభం కుమార్ తెలిపారు.

సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్‌లు ప్రారంభించి, బోటులో గల్లంతైన వారి ఆచూకీని కనిపెట్టినట్లు ఎస్‌డీఎం తెలిపారు.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×