
Boris Johnson: బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వయస్సు 59 ఏళ్లు. కానీ ఈ వయస్సులోనూ ఆయన మరోసారి తండ్రి అయ్యారు. బోరిస్ జాన్సన్ మూడో భార్య 35 ఏళ్ల
కేరీ మగబిడ్డకు జన్మినిచ్చారు. ఈ విషయాన్ని కేరీ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా తెలిపారు.
2021లో కేరీని బోరిస్ జాన్సన్ వివాహమాడారు. ఈ దంపతులకు వివాహానికి ముందే ఓ అబ్బాయి పుట్టాడు. ఈ జంటకు ఇపుడు పుట్టిన బాబు మూడో సంతానం. తన కుమారుడికి స్వాగతం చెబుతూ కేరీ మురిసిపోయింది.
తమ బిడ్డ పెట్టాలనుకున్న కొన్ని పేర్లను కేరీ వెల్లడించారు. అందులో తన భర్త ఏ పేరును ఎంపిక చేస్తారో ఊహించగలరా? అని ఇన్ స్టాగ్రామ్ పోస్టులో కోరారు. ఆ పేర్లలో గ్రీకు రాజు ఒడీసియస్ పేరు కూడా ఉంది. బోరిస్ జాన్సన్ కు గతంలో ఇద్దరు భార్యల ద్వారా ఐదుగురు పిల్లలు పుట్టారు. ఆ సతీమణుల్లో మెరినా వీలర్ భారతీయ మూలాలు ఉన్న కుటుంబానికి చెందిన మహిళ. మొత్తంమీద బోరిస్ జాన్సన్ 3 ముగ్గుర భార్యల ద్వారా 8 మంది పిల్లలకు తండ్రిగా ఉన్నారు.