US Drinks Ban: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాల అమలులోకి వచ్చిన రోజు పంజాబ్‌లోని ఓ ప్రైవేటు యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ క్యాంపస్‌లో అమెరికా సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్‌లను నిషేధించింది. ఈ మేరకు యూనివర్సిటీ ఫౌండర్-ఛాన్సలర్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇంకా ఏమన్నారాంటే..
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ కీలక నిర్ణయం తీసుకున్నరు. బుధవారం నుంచి తమ క్యాంపస్‌లో అమెరికా శీతల పానీయాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన దేశవ్యాప్తంగా ‘స్వదేశీ 2.0’ ఉద్యమాన్ని మొదలుపెట్టారు.
భారత ఎగుమతులపై అమెరికా సుంకాలు రెట్టింపు చేసిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టింది. వినాయక చవితి నేపథ్యంలో ఢిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఆయన, కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో ఛాన్సలర్ మిట్టల్ ఈ ప్రకటన చేశారు. ఇందులో భారతీయులందరూ చేతులు కలపాలని మిట్టల్ విజ్ఞప్తి చేశారు.
అమెరికా చర్యను ఆర్థిక దౌర్జన్యంగా అభివర్ణించారు మిట్టల్. అమెరికా దాని మిత్రదేశాలు రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడాన్ని తప్పుబట్టారు. అమెరికా రెండు నాల్కల ధోరణికి ఇదే నిదర్శనమని చెప్పకనే చెప్పారు. భారత్ ఎవరి ముందు తలవంచదని స్పష్టం చేశారు.
ALSO READ: మహారాష్ట్రలో కూలిన భవనం.. 15 మంది మృతి
భారత మార్కెట్ నుంచి ఏటా 6.5 లక్షల కోట్ల లాభాలు గడిస్తున్న అమెరికా కంపెనీలు, భారత్‌పై ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు. భారత్‌లో అతిపెద్ద ప్రైవేటు యూనివర్సిటీల్లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఒకటి. అక్కడ దాదాపు 40 వేల విద్యార్థులు చదువుతున్నారు.
తాము తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా మద్దతు లభించడం చూసి గర్వపడుతున్నాన్నట్లు డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. ఆ ఛాన్సలర్ ఆప్ ఎంపీ కూడా. దేశవ్యాప్తంగా ఇది ఉద్యమంగా మారితే అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందటూ ముగించారు ఆయన.
అంతకుముందు మిట్టల్.. అధ్యక్షుడు ట్రంప్‌కు బహిరంగ లేఖ రాశారు. సుంకాల పెంపును అన్యాయం-అంతరాయం కలిగించేదిగా వర్ణించారు. అమెరికన్ కంపెనీలు విద్య, సాంకేతికత , ఆర్థికం, ఐటీ వంటి రంగాలలో భారత నుండి ఏటా 80 బిలియన్ల డాలర్లుపైగా ఉత్పత్తి చేస్తోందని అందులో ప్రస్తావించారు.
If the US goes ahead and imposes 50% tariffs on Indian exports, Lovely Professional University will not sit quietly.
Let me remind the US once again – we will ban all American soft drinks on campus, if the US doesn’t withdraw the unfair tariffs by 27th August.
I urge every… pic.twitter.com/PhBsVNSJHe
— Ashok Kumar Mittal (@DrAshokKMittal) August 24, 2025