High Alert In Bihar: బీహార్‌లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు రాష్ట్రంలో చొరబడ్డారంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం.. దీంతో పోలీసులు ఇచ్చిన సమాచారంతో ప్రజలు అలర్ట్ అయ్యారు. ఆ ముగ్గురు ఉగ్రవాదుల ఫోటోలు, వివరాలతో సహా ప్రజల ముందు ఉంచారు. వీరు ఎక్కడ కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. బీహార్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రచార పర్వాన్ని ప్రారంభించాయి అన్ని పార్టీలు. ఇలాంటి సమయంలో ఇలాంటి స్టేట్‌మెంట్ రావడం కాస్త ఆందోళనను పెంచే విషయమే.
ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు ప్రవేశించినట్టు గుర్తింపు
ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించారు అధికారులు. పాకిస్థాన్‌లోని రావల్పిండికి చెందిన హస్నైన్ అలీ.. ఉమర్‌కోట్‌కు చెందిన ఆదిల్ హుస్సేన్, బహవల్‌పూర్‌కు చెందిన మహ్మద్ ఉస్మాన్‌గా గుర్తించారు. వీరంతా నేపాల్ మీదుగా బీహార్‌లోకి చొరబడ్డట్టు గుర్తించారు. ఈ నెల రెండో వారంలోనేపాల్‌కు చేరుకున్న వీరు.. అక్కడి నుంచి బీహార్‌లోకి చొరబడ్డారు
రాష్ట్రవ్యాప్తంగా భద్రతను పెంచిన బీహార్ పోలీసులు
ప్రస్తుతం బీహార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్ సరిహద్దుల్లో గస్తీని కూడా పెంచారు. నిజానికి ఆపరేషన్ సిందూర్ సమయం నుంచి భద్రతను పెంచారు. అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అలాగే కొనసాగిస్తున్నారు. బీహార్‌లోని ఏడు జిల్లాలు నేపాల్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి. అయితే 729 కిలోమీటర్ల పొడవైన ఓపెన్ బార్డర్ ఉండటం ఇప్పుడు భద్రతా బలగాలకు సవాల్‌గా మారింది.
Also Read: పసిడి ప్రియులకు షాక్! మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?
ప్రస్తుతం బీహార్‌లో పీక్స్‌లో పొలిటికల్ హీట్
ప్రస్తుతం రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు.. రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. గడిచిన 20 రోజుల్లో మొత్తం 18 మంది కొత్త వ్యక్తులు బీహార్‌లో చొరబడినట్టు తెలుస్తోంది. వీరిలో కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు ఖలిస్థానీ అని కూడా అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఉగ్రవేట కొనసాగుతోంది.