BigTV English

Bride: మేకప్‌ కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్లిన వధువు.. ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

Bride: మేకప్‌ కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్లిన వధువు.. ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

Bride: పెళ్లిలో అందంగా కనిపించేందుకు అమ్మాయిలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బ్యూటీపార్లర్‌కు వెళ్లి కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. పెళ్లికి పది రోజుల ముందు నుంచే అందంగా కనిపించడానికి ప్రయత్నాలు మెదలు పెడతారు. అయితే కొన్ని సార్లు ఈ ప్రయత్నాలు బెడిసికొడుతుంటాయి. ప్రయోగాలు ఫెయిలై.. అందంగా ఉన్న ముఖం కూడా వికారంగా కనిపిస్తుంది. ఇటువంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది.


పదిరోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన ఓ వధువు అందంగా కనిపించడం కోసం బ్యూటీపార్లకు వెళ్లింది. అక్కడ బ్యూటీషన్ ఆమెపై కొత్త ప్రయోగం చేసింది. అది కాస్త ఫెయిల్ కావడంతో.. ఆమె ముఖాకృతే మారిపోయింది. దెబ్బకు పెళ్లి కొడుకు బయపడిపోయి ఏకంగా పెళ్లినే క్యాన్సిల్ చేసుకున్నాడు.

హసన్ జిల్లా అరసికరె‌కు చెందిన ఓ యువతికి ఇటీవల పెళ్లి కుదిరింది. మరో పది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈక్రమంలో ఆమె స్థానికంగా ఉన్న ఓ బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. అయితే అక్కడ బ్యూటీషియన్.. మరింత అందంగా కనిపించేలా కొత్తరకమైన మేకప్ వేస్తానని చెప్పి ఆమె ముఖానికి ఫౌండేషన్ రాసింది. ఆ తర్వాత ఆవిరి పట్టింది. కొద్దిసేపటికి ఆమె ముఖం మొత్తం కాలిపోయింది. ముఖంపై బొబ్బెలెక్కాయి. ముఖాకృతి కూడా మారిపోయింది.


వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పెళ్లిని కొద్దిరోజులు వాయిదా వేశారు. ఆ తర్వాత యువతిని చూసిన వరుడు పెళ్లి వద్దంటే వద్దంటూ పట్టుబట్టాడు. తనను పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పాడు. దీంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. పెళ్లిలో అందంగా కనిపించడానికి బ్యూటీపార్లర్‌కు వెళ్తే.. అదికాస్త బెడిసికొట్టి పెళ్లే క్యాన్సిల్ అవ్వడానికి దారి తీసింది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×