E-Paper
Advertisement

Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. లవ్యూ అక్క.. మంచు మనోజ్ ఎమోషనల్

Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. లవ్యూ అక్క..  మంచు మనోజ్ ఎమోషనల్
Advertisement

Manoj: మంచు మనోజ్, మంచు లక్ష్మిల మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. తమ్ముడంటే లక్ష్మికి ప్రాణం.. ఎంతో ప్రేమ. తమ్ముడి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అండదండగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆచీతూచీ అడుగులేస్తుంది. ఈ విషయాన్ని లక్ష్మి ఎన్నో సందర్భాల్లో చెప్పింది. తమ ఫ్యామిలీలో అందరికంటే మనోజ్ అంటేనే ఎక్కువ ఇష్టమని.. తన కొడుకులా చూసుకుంటానని చెప్పుకొచ్చింది.

మనోజ్ పెళ్లి కూడా దగ్గరుండి జరిపించింది. పెళ్లి కొడుకును చేసే దగ్గరి నుంచి పెళ్లి తంతు ముగిసే వరకు అన్ని పనులు దగ్గరుండి చూసుకుంది. పెళ్లి పెద్దగా మారి స్వయంగా తన ఇంట్లోనే పెళ్లి జరిపించింది. అంతకంటే ముందు మంచు ఫ్యామిలీకి ఈ పెళ్లి అంటే ఇష్టం లేదట. పెళ్లి మ్యాటర్ రాగానే మోహన్‌బాబు అస్సలు ఒప్పుకోలేదట. మంచు లక్ష్మీనే దగ్గరుండి మరీ పెళ్లికి ఒప్పించిందట. పెళ్లికి రానని మోహన్‌బాబు పట్టుబట్టి కూర్చుంటే లక్ష్మీనే నచ్చజెప్పి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక శుక్రవారం రాత్రి మంచు మనోజ్, భూమా మౌనికారెడ్డిలు వివాహబంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వారి పెళ్లి వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా మనోజ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్ పోస్టు పెట్టాడు. మంచు లక్ష్మి తనను పెళ్లి కొడుకు చేస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘అక్కా.. ఏ జన్మ పుణ్యమో నాది. లవ్యూ అక్క. థ్యాంక్స్‌ ఫర్‌ ఎవ్రీథింగ్‌’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×