E-Paper
Advertisement

ShivaRaj Singh Chouhan: సడెన్‌గా రైలులో కనిపించిన కేంద్రమంత్రి.. ఆశ్చర్యపోయిన ప్రయాణికులు (వీడియో వైరల్)

ShivaRaj Singh Chouhan: సడెన్‌గా రైలులో కనిపించిన కేంద్రమంత్రి.. ఆశ్చర్యపోయిన ప్రయాణికులు (వీడియో వైరల్)
Advertisement

Central Minister ShivaRaj Singh Chouhan: ముఖ్యమంత్రిగా ఆయన సేవలు అందించారు. నిరాడంబర నేతగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఆయన పనితీరును గమనించిన బీజేపీ అధిష్టానం ఆయనకు ఇటీవలే కేంద్రమంత్రిగా అవకాశం కల్పించింది. ప్రధానితోపాటు రాష్ట్రపతి భవన్ లో ఆయన కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారిగా తన రాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. అది కూడా రైలులో సాధారణ వ్యక్తిగా ప్రయాణం చేశారు. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అనంతరం ఆయనతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు అవి వైరల్ గా మారాయి. ఆ కేంద్రమంత్రిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించిన శివరాజ్ సింగ్ చౌహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీర్ఘకాలం సీఎంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో విదిశ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఏకంగా 8.2 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నిరాడంబర నేతగా ఆయనకు ప్రజల్లో గుర్తింపు ఉంది. ఈ విషయాన్ని ఆయన మరోసారి నిరూపించారు. ఎంపీగా గెలిచిన శివరాజ్ సింగ్ చౌహాన్ కు బీజేపీ అధిష్టానం కేంద్రమంత్రిగా అవకాశం కల్పించింది. కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారిగా ఆయన తన రాష్ట్రానికి ఢిల్లీ నుంచి రైలులో బయలుదేరి వెళ్లారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ వ్యక్తిలా రైలులో ప్రయాణించారు.

Advertisement

అయితే, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సెడన్ గా కనిపించేసరికి తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. సాధారణ వ్యక్తిలో రైలులో ప్రయాణించటాన్ని చూసి ప్రశంసించారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడి సంతోషం వ్యక్తం చేశారు. ఆయనతో పలువురు సెల్ఫీలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో మంత్రి అశ్విని వైష్ణవ్ కృషితో భారతీయ రైల్వేలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆ శాఖ నిరంతరం శ్రమిస్తోందంటూ శివరాజ్ సింగ్ అభివర్ణించారు.

Also Read: త్వరలోనే పట్టాలపై పరుగులు పెట్టనున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్స్..

Advertisement

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను సోషల్ మీడియా వేదికగా కేంద్రమంత్రి పంచుకున్నారు. ఇప్పుడవి వైరల్ గా మారాయి. వాటిని చూసిన నెటిజన్స్ కేంద్రమంత్రిపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×