E-Paper
Advertisement

గౌహతికి చేరుకున్న సీఎం చంద్రబాబు టీమ్, ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, బిశ్వశర్మ ప్రమాణ స్వీకారానికి హాజరు

గౌహతికి చేరుకున్న సీఎం చంద్రబాబు టీమ్, ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, బిశ్వశర్మ ప్రమాణ స్వీకారానికి హాజరు
Advertisement

Guwahati: ఏపీ సీఎం చంద్రబాబు గౌహతి చేరుకున్నారు.  మంగళవారం అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే నేతలు అక్కడికి తరలివస్తున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా గౌహతికి చేరుకున్నారు.

గౌహతికి చేరుకున్న సీఎం చంద్రబాబు టీమ్

Advertisement

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు వంటి అంశాలపై చర్చించారు. అనంతరం సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి నేరుగా అస్సాం రాజధాని గౌహతికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్ కూడా హాజరయ్యారు.

మంగళవారం అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే పెద్దలు అంతా వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అయితే మంత్రి లోకేష్‌కు బిశ్వశర్మ ప్రత్యేకంగా ఆహ్వానించారు. సింగపూర్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకుని మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు‌తో కలిసి రాత్రి గౌహతికి చేరుకున్నారు.

Advertisement

ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం.. బిశ్వశర్మ ప్రమాణ స్వీకారానికి హాజరు

సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్‌లకు గౌహతిలో ఘన స్వాగతం లభించింది.  బీజేపీ  నేతలు విమానాశ్రయంలో  చంద్రబాబు టీమ్‌కు ఆహ్వానం పలికారు. అస్సాం సంస్కృతికి ప్రతీక జాపి టోపీ, గమోసా కండువాతో సీఎం చంద్రబాబును గౌరవించారు. అక్కడి సాంప్రదాయంలో ముఖ్యమంత్రి సరికొత్తగా కనిపించారు.

ఇలాంటి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు మాత్రమే హాజరయ్యేవారు. అయితే హేమంత బిశ్వశర్మ ప్రత్యేకంగా ఆహ్వానించడంతో మంత్రి లోకేష్ హాజరయ్యారు. తండ్రీకొడుకులు అస్సాం సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు చిక్కారు. అస్సాం ఆత్మీయతకు.. ఆంధ్ర చురుకుదనానికి ఇదొక చక్కని ఉదాహరణ!

ALSO READ: 17 రాష్ట్రాలు, 5 యూటీల్లో.. మూడో దశ S.I.Rకి రంగం సిద్ధం

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×