E-Paper
Advertisement

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. సీఎం సిద్ధరామయ్య చేతిలో కులగణన నివేదిక, ఆసక్తికర..

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం..  సీఎం సిద్ధరామయ్య చేతిలో కులగణన నివేదిక, ఆసక్తికర..
Advertisement

Bengaluru: కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేస్తారనే ఊహాగానాలు నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటక కుల గణన నివేదికను సీఎం సిద్ధరామయ్యకు వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదికను అందజేసింది. అందులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు నేషనల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఇంతకీ ఆ నివేదికలో సారాంశం ఏంటి?

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం

Advertisement

కర్ణాటక రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం సీఎం సిద్దరామయ్యకు కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్.. సామాజిక-విద్యా సర్వే నివేదికను అందజేసింది. మొత్తం 300 పేజీలతో కూడిన నివేదికను పారదర్శకంగా, నిష్పాక్షికంగా రూపొందించామని కమిషన్ చైర్మన్ మధుసూదన్ నాయక్ వెల్లడించారు. నివేదికలోని వివరాలను ఇప్పుడు వెల్లడించలేమని ఆయన తేల్చిచెప్పారు.

ఓ బీసీలకు సంబంధించిన నివేదిక రెడీ అయ్యిందని అన్నారు. బయట జరుగుతున్న ఊహాగానాలకు-నివేదికకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నివేదిక అనువాదానికి ఎక్కువ సమయం పట్టిందన్నారు. తొలుత మే 30న నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ప్రణాళిక వేసుకున్నామని, మే 29న సెలవు కావడంతో ముందుగా సమర్పించినట్టు తెలిపారు.

Advertisement

సీఎం సిద్ధరామయ్య చేతిలో కులగణన నివేదిక.. వెలుగులోకి కొత్త విషయాలు

నివేదిక అధికారికంగా బయటకు రాక ముందు కీలక వివరాలు బయటకు వచ్చాయి. ఈ సమాచారం మేరకు కర్ణాటక జనాభాలో ముస్లింలు-14 శాతంతో అంటే 75-80 లక్షల మధ్య జనాభా అతిపెద్ద సామాజిక వర్గంగా నిలిచినట్టు తెలుస్తోంది. వీరశైవ-లింగాయత్‌లు- 11 శాతం ఉన్నారు. రాష్ట్ర జనాభా 60 లక్షల నుండి 65 లక్షల మధ్య ఉంటుందని అంచనా. రెండో అతిపెద్ద సామాజికవర్గంగా నిలిచింది.

జనాభాలో సుమారు 10 శాతం ఉన్న వొక్కలిగలు.. 55 లక్షల నుండి 60 లక్షలతో మూడో అతిపెద్ద కమ్యూనిటీగా ఉంది. ఆ తర్వాత కురుబలు 8 శాతంతో (40-45 లక్షలు) తర్వాత స్థానాల్లో మిగతా కులాలు ఉన్నాయి. ఈ నివేదికను ప్రభుత్వం త్వరలో బయటపెట్టనుంది. ఈ నివేదిక కర్ణాటక రిజర్వేషన్ల విధానం, రాజకీయ సమీకరణాల్లో ఎలాంటి మార్పులకు దారి తీస్తుందోనన్న ఆసక్తికరమైన చర్చ అప్పుడే మొదలైంది.

ALSO READ: దేశంలో కొనసాగుతున్న హీట్ వేవ్.. ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు, ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దంటూ

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×