E-Paper
Advertisement

Gas Cylinders Crunch: ఎల్‌పీజీ కొరత.. లోక్‌సభ గేటు వద్ద ఎంపీల నిరసన, చర్చకు పెట్టాలని ఎంపీ కిరణ్ డిమాండ్

Gas Cylinders Crunch: ఎల్‌పీజీ కొరత.. లోక్‌సభ గేటు వద్ద ఎంపీల నిరసన, చర్చకు పెట్టాలని ఎంపీ కిరణ్ డిమాండ్
Advertisement

Gas Cylinders Crunch: దేశంలో రోజు రోజుకూ ఎల్‌పీజీ గ్యాస్ కొరత వెంటాడుతోంది. చాలా చోట్ల హోటళ్లు మూతపడ్డాయి. గృహ అవసరాలను తీర్చాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో ప్రజల్లో గ్యాస్ సిలిండర్ల నుంచి భయం వెంటాడుతోంది. హోటళ్లు, పీజీ హాస్టల్స్ చాలావరకు మూతబడ్డాయి. ఈ సెగ పార్లమెంటుని తాకింది.

ఎల్‌పీజీ కొరత.. లోక్‌సభ గేటు వద్ద కాంగ్రెస్ ఎంపీల నిరసన

Advertisement

దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత వెంటాడుతోంది. గడిచిన వారం రోజులుగా గల్ప్ దేశాల నుంచి ఆయిల్ ట్యాంకులు రావడం లేదు. ఉన్న నిల్వలు రోజు రోజుకూ తరిగిపోతున్నాయి. ఫలితంగా వినియోగదారుల్లో టెన్షన్ మొదలైంది. ఇంట్లో సిలిండర్ ఉండగా, మరొక సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు. అంతేకాదు చాలా ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీల ముందు వినియోగదారులు బారులు తీరారు. ఈ సెగ చివరకు పార్లమెంటును తాకింది.

ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకుంది ఇండియా కూటమి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సమావేశాలకు ముందు లోక్‌సభ ప్రాంగణంలో ఇండియా కూటమి ఎంపీలు ధర్నాలో పాల్గొన్నారు. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులు చేతపట్టి, సభలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Advertisement

సభలో చర్చకు పెట్టాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ డిమాండ్

LPG గ్యాస్ సిలిండర్ కొరతపై పార్లమెంట్ లో చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రోజు రోజుకు ఈ సమస్య జఠిలమవుతోందని, కేంద్రం సైలంట్‌గా ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏది చెబితే ప్రధాని మోదీ అదే వింటున్నారని ఆరోపించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్, ఇప్పటివరకు యుద్ధంపై ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు.

సమస్యను కేంద్రం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 18వ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు మాట్లాడనీయడం లేదని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం మోడీ అజెండాగా మారిందని ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధానమంత్రి మోడీ ఎందుకు భయపడుతున్నారో అర్ధం కాలేదన్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం పరిస్థితులు, దాని ప్రభావంపై ప్రధాని పార్లమెంట్‌లో కచ్చితంగా మాట్లాడాలన్నారు.ః

ALSO READ: ఆనాడు ఏటీఎంల వద్ద.. ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీల వద్ద అదే పరిస్థితి

 

Related News

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×