E-Paper
Advertisement

తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్-టీవీకే పొత్తు, రానున్న రోజుల్లో కలిసే అడుగులు

తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్-టీవీకే పొత్తు, రానున్న రోజుల్లో కలిసే అడుగులు
Advertisement

Tamilnadu Politics: తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గవర్నర్‌ను విజయ్ కలవకుండానే మద్దతు ప్రయత్నాలు వేగవంతం చేసింది ఆ పార్టీ. బుధవారం సమావేశమైన తమిళనాడు కాంగ్రెస్ యూనిట్, టీవీకే ప్రభుత్వానికి మద్దతు విషయమై చర్చించింది. నేతలంతా ఓకే చెప్పేశారు. టీవీకేకు మద్దతు తెలుపుతూ అధికారిక ప్రకటన విడుదల చేశారు ఏఐసీసీ తమిళనాడు ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్.

తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు

Advertisement

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వేలేదు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ కేవలం 10 సీట్ల దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు సన్నాహాలు చేస్తున్నారు టీవీకే చీఫ్ విజయ్.

తొలుత కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగించారు.  టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు తెలపడం, ఈపై లేఖ విడుదల చేయడం చకచకా జరిగిపోయింది. మతతత్వ శక్తులను దూరంగా ఉంచాలనే ప్రధాన లక్ష్యంతో మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో లౌకిక, అభ్యుదయ, సంక్షేమ ప్రభుత్వాన్ని అందించడమే ప్రజా తీర్పు ఉద్దేశమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.

Advertisement

కాంగ్రెస్-టీవీకే పొత్తు, రానున్న రోజుల్లో కలిసే అడుగులు

కేవలం ప్రభుత్వం ఏర్పాటుకే కాకుండా, భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థలు, లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లో టీవీకేతో కలిసి పని చేస్తామని స్పష్టం చేసింది. ఈ లెక్కన రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీలు కలిసి అడుగులు వేయనున్నాయి.

మరోవైపు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామిని‌తో టీవీకే నేత ఆనంద్ భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన నివాసం నుంచి విజయ్ నివాసానికి బయలుదేరి వెళ్లారు ఆనంద్. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలపాలని పళనిస్వామిని కోరినట్లు సమాచారం. ఇదిలావుండగా విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు అన్నాడీఎంకే మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్దమయ్యారు.

ALSO READ: బెంగాల్‌లో హింస-విధ్వంసం.. విగ్రహాలు ధ్వంసం, ఆఫీసులకు నిప్పు, ఈసీ ఆదేశాలతో అధికారులు

చెన్నైలోని సీవీ షణ్ముగం ఆఫీసులో 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. వీరంతా విజయ్‌కు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ 47 స్థానాలు దక్కించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని గవర్నర్‌ను కలవనున్నారు టీవీకే అధినేత విజయ్.

 

 

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×