E-Paper
Advertisement

Cyclone: బిపోర్‌జోయ్‌ బీభత్సం.. తీరాన్ని తాకేసింది…

Cyclone: బిపోర్‌జోయ్‌ బీభత్సం.. తీరాన్ని తాకేసింది…
Advertisement
cyclone-biporjoy

Cyclone: బిపోర్‌జోయ్‌ తీరాన్ని తాకేసింది. గుజరాత్ కచ్ తీరంలో బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ప్రభావానికి భారీ వర్షం పడుతోంది. ఆకాశమంతా మేఘాలతో నిండిపోయింది. గంటకు 100 కి.మీ.కు పైగా వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే తీర ప్రాంతంలోని 20 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలెవ్వరూ ఇళ్లు వదలి బయటికి రావద్దని సూచించారు అధికారులు.

అర్థరాత్రికి సైక్లోన్ పూర్తి స్థాయిలో తీరం దాటేసి.. భూభాగంలోకి ప్రవేశించనుంది. తీరం దాటాక తీవ్ర తుపానుగా.. ఆ తర్వాత వాయుగుండంగా బలహీనపడనుంది. ఇప్పటికే సముద్రంలో కెరటాలు భారీగా ఎగిసిపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. బిపోర్‌జోయ్ దాటికి గుజరాత్‌లోని అనేక జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.

Advertisement

తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. స్కూల్స్, టెంపుల్స్, ఆఫీసులను మూసేశారు. 18 ఎన్డీఆర్‌ఎఫ్‌, 12 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రెడీగా ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ విభాగాలను అలర్ట్ చేశారు. బోట్లు, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. రైల్వే శాఖ 76 రైళ్లను రద్దు చేసింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.

బిపోర్‌జోయ్ తుపాను ప్రభావంతో గుజరాత్‌తో పాటు మరో 8 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గోవా రాష్ట్రాలతోపాటు దమణ్‌ దీవ్‌, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×