BigTV English

Karan Johar’s show : నెపోటిజంపై కరణ్ జోహార్ షో.. త్వరలోనే..

Karan Johar’s show : నెపోటిజంపై కరణ్ జోహార్ షో.. త్వరలోనే..
Karan Johar's show


Karan Johar’s show(Bollywood celebrity news) : ఒకప్పుడు టాక్ షోలకు అంతగా క్రేజ్ ఉండేది కాదు. ఇంటర్వ్యూలు, టాక్ షోలు.. వీటిలో పాల్గొనడానికి సీనియర్ హీరోలు ఆసక్తి చూపించేవారు కాదు. కానీ బాలీవుడ్ అనేది టాక్ షోల రూపురేఖలనే మార్చేసింది. టాక్ షోల రూపంలో తమకు నచ్చిన హీరోలు, హీరోయిన్ల గురించి, వారి పర్సనల్ జీవితాల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుందని.. ఆడియన్స్ వాటిని ఆదరించడం మొదలుపెట్టారు. ఇలాంటి టాక్ షోలకు హైప్ క్రియేట్ చేసిన కరణ్ జోహార్.. కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

బాలీవుడ్‌లోని మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. కరణ్‌ను కాదని అక్కడ పెద్ద పెద్ద దర్శకులు సైతం సినిమాలు తీయలేడని బీ టౌన్ అనుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా స్టార్ హీరోల, హీరోయిన్ల కూతుళ్లను, కొడుకులను వెండితెరకు పరిచయం చేయాలంటే కరణే కరెక్ట్ అని కూడా అక్కడ టాక్ ఉంది. మొత్తంగా కరణ్ జోహార్.. బాలీవుడ్‌లో నెపోటిజంకు ప్రాణం పోశాడని, అంతే కాకుండా నెపో కిడ్స్‌కు కరణ్ బాగా క్లోజ్ అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. దీనిని కరణ్ కూడా చాలాసార్లు ఓపెన్‌గా ఒప్పుకున్నాడు.


‘కాఫీ విత్ కరణ్’ పేరుతో కరణ్ జోహార్ క్రియేట్ చేసిన టాక్ షో.. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ను బయటపెట్టింది. ఇందులో కరణ్ అడిగే ముక్కుసూటి ప్రశ్నలు.. దానికి సెలబ్రిటీలు ఇచ్చే సమాధానాలు.. ప్రేక్షకులను ఈ షోకు ఫ్యాన్‌ను చేశాయి. అందుకే ఈ టాక్ షో సక్సెస్‌ఫుల్‌గా 7 సీజన్లను పూర్తి చేసుకుంది. అంతే కాకుండా 8వ సీజన్‌కు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలోనే కరణ్ ఒక కొత్త టాక్ షోను ప్రారంభించనున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. అంతే కాకుండా ఈ కొత్త షో పూర్తిగా నెపోటిజంపైనే ఉంటుందని టాక్.

‘షోటైమ్’ అనే పేరుతో పూర్తిగా నెపోటిజంపై ఒక షో చేయనున్నాడట కరణ్ జోహార్. నెపోటిజం గురించి మాట్లాడడానికి ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుందని ఈ షో మేకర్స్ భావించారట. అందుకే ఈ కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల మందుకు రావాలని అనుకుంటున్నట్టు సమాచారం. తాజాగా డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ హెడ్ కంటెంట్ ఈ ‘షోటైమ్’ గురించి కొన్ని విషయాలు బయటపెట్టారు. ఈ షో పూర్తిగా నెపోటిజంపై ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇక కరణ్ జోహార్ ‘షోటైమ్’ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందో చూడాలి మరి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×