E-Paper
Advertisement

Gokulpuri Metro Station: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. రోడ్డుపై కుప్పకూలిన మెట్రో ప్లాట్ ఫారమ్..

Gokulpuri Metro Station: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. రోడ్డుపై కుప్పకూలిన మెట్రో ప్లాట్ ఫారమ్..
Advertisement

Gokulpuri Metro Station in Delhi:ఢిల్లీ మెట్రో గోకుల్‌పురి స్టేషన్‌లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. గోకుల్‌పురి మెట్రో పింక్‌లైన్‌ స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్‌ సైడ్‌ వాల్‌లో కొంత భాగం కూలిపోయి రోడ్డుపై పడింది.

ఉదయం సమయం కావడంతో మెట్రో స్టేషన్ దిగువన వెళ్లే రోడ్డుపై జనం రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ప్లాట్ పారమ్ సైడ్ వాల్ కూలిపోవడంతో భయాందోళనకు గురి అయ్యారు. శిథిలాలలో ఒకరు చిక్కుకోగా, 3 నుంచి 4 మందికి గాయాలైనట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

Advertisement

ఘటనా సమయంలో స్కూటర్‌పై వెళుతున్న వ్యక్తి శిథిలాల కింద చిక్కుకున్నారు. కొందరి సహాయంతో పోలీసులు బయటకు తీశారు. క్షతగాత్రులను జీటీబీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను గుర్తించేందుకు చర్యలు చేపట్టి మరింత సమాచారం సేకరిస్తున్నారు.

ఘటన జరిగిన వెంటనే జేసీబీ, క్రేన్ సహాయంతో శిథిలాలను తొలగించారు. ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నామని ఉత్తర ఢిల్లీ డీసీపీ తెలిపారు. అదే సమయంలో, ఈ ప్రమాదం తర్వాత, మెట్రో యొక్క కొత్త మార్గాలలో పింక్ రూట్ ఒకటి కాబట్టి నిర్మాణ పనుల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×