E-Paper
Advertisement

Private Health Care: రోగికి ఇన్సురెన్స్ ఉందని తెలిస్తే చాలు.. హాస్పిటళ్లలో దోపిడీ దందా మొదలు.. ఎంపీ కీలక వ్యాఖ్యలు

Private Health Care: రోగికి ఇన్సురెన్స్ ఉందని తెలిస్తే చాలు.. హాస్పిటళ్లలో దోపిడీ దందా మొదలు.. ఎంపీ కీలక వ్యాఖ్యలు
Advertisement

Private Health Care: న్యూ దిల్లీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పార్లమెంటులో ప్రైవేట్ ఆసుపత్రుల మోసంపై కీలక ప్రశ్న లేవనెత్తారు. దేశంలోని ఆసుపత్రి వ్యవస్థ చాలా పేలవమైన స్థితిలో ఉందన్నారు. పెద్ద ఆసుపత్రులలో బెడ్ ఛార్జీలు ఫైవ్ స్టార్ హోటళ్ల కంటే ఎక్కువగా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. ఒక సాధారణ వ్యక్తి చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే, రోగికి బీమా ఉందా? లేదా? అనేది మొదటి ప్రశ్నగా ఉంటుందన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని తెలిస్తే.. ఆసుపత్రి “బిల్లింగ్ మీటర్” సూపర్ స్పీడ్ తో పనిచేస్తుందన్నారు. రోగులకు నిజంగా అవసరం లేని మందులు కూడా రాసేస్తున్నారని చెప్పారు. అనవసరమైన పరీక్షలు, మందులతో బిల్లులు పెంచేస్తున్నారని మండిపడ్డారు.

రోజుల తరబడి ఆసుపత్రుల్లో

ఒక రోగి సాధారణంగా ఐదు రోజుల్లో కోలుకోగలిగితే, ఇన్సూరెన్స్ ఉండటం వల్ల.. ఆ రోగిని 10 నుంచి 15 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచేస్తున్నామని స్వామి మలివాల్ మండిపడ్డారు. ఈ సమస్యను తీవ్రంగా పరిశీలించి, ఆరోగ్య వ్యవస్థ ద్వారా సామాన్య ప్రజలను దోపిడీ చేయకుండా కాపాడాలని స్వాతి మలివాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల రాజ్యసభలో ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఈ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ప్రైవేట్ హెల్త్‌కేర్ ఖర్చులు పెరుగుతున్నాయనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైందన్నారు. ఈ అంశం ‘లక్షలాది మంది భారతీయులను ప్రభావితం చేసే అంశం”గా ఆమె పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆర్థిక ఇబ్బందుల నుండి రక్షించడానికి కేంద్రం తక్షణం సంస్కరణలు తీసుకురావాలని మలివాల్ డిమాండ్ చేశారు.

ముందు చికిత్స, తర్వాత బిల్లు

స్వామి మలివాల్ సభలో మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రులలో అత్యవసర చికిత్స కోసం “ముందు చికిత్స, తరువాత బిల్లు” అనే సూత్రాన్ని చట్టబద్ధం చేయాలని మలివాల్ ప్రభుత్వాన్ని కోరారు. రోగులు అత్యవసర చికిత్స కోసం తరచుగా తమ సేవింగ్స్, ఆస్తులు, ఇళ్లను కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుందని ఆమె అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల భారీ బిల్లులను హైలైట్ చేస్తూ.. ఆసుపత్రి గదులను డీలక్స్, ప్రీమియం లేదా సూట్‌లుగా.. ఫైవ్ స్టార్ హోటళ్లతో పోటీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. రోగికి ఇన్సూరెన్స్ ఉందని తెలిస్తే బిల్లులు భారీగా వసూలు చేస్తున్నారన్నారు. గ్లౌజులు, మాస్క్‌లు, థర్మామీటర్లు వంటి బేసిక్ వస్తువులకు కూడా అధిక బిల్లులు వసూలు చేస్తున్నారన్నారు.

Advertisement

Also Read: ఈపీఎఫ్ ఉద్యోగికి ఉచిత బీమా.. రూ.7 లక్షల వరకూ కవరేజీ.. పూర్తి వివరాలు ఇలా

ప్రైవేట్ హెల్త్ కేర్ దోపిడీ

తమ వ్యాఖ్యలు ప్రైవేట్ హెల్త్‌కేర్‌లోని దోపిడీ వ్యవస్థలను ఉద్దేశించినవని, వైద్యులను ఉద్దేశించి కాదన్నారు మలివాల్. ఆసుపత్రుల బయట జనరిక్ సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, అనవసరమైన టెస్టులు చేస్తున్నారని, రిటైల్ ధరకు మందులు అమ్ముతున్నారని ఆమె ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను ఆదాయ వనరులుగా కాకుండా మనుషులుగా పరిగణించాలని ఆమె కోరారు. పారదర్శక బిల్లింగ్ వ్యవస్థలు, ఆరోగ్య బీమా ప్రీమియం పెంపు కఠినంగా పర్యవేక్షించాలని కేంద్రాన్ని కోరారు.

 

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×