E-Paper
Advertisement

Talakaya Kura Recipe: పక్కా అమ్మమ్మ స్టైల్లో తలకాయ కూర.. వేడి వేడి అన్నంలోకి అదిరిపోయే టేస్ట్!

Talakaya Kura Recipe: పక్కా అమ్మమ్మ స్టైల్లో తలకాయ కూర.. వేడి వేడి అన్నంలోకి అదిరిపోయే టేస్ట్!
Advertisement

Talakaya Kura Recipe: తలకాయ కూర పేరు వినగానే మాంసాహార ప్రియులకు నోట్లో నీళ్లు ఊరడం ఖాయం. హోటళ్లలో ఎన్ని రకాలుగా తిన్నా, ఎన్ని మసాలాలు దట్టించినా.. ఆ పాత కాలపు పద్ధతిలో, ఇంట్లో అమ్మ వండినప్పుడు వచ్చే ఆ అసలు సిసలు రుచి మాత్రం ఎక్కడో మిస్ అవుతుంటాం. ముక్కకు మసాలా బాగా పట్టి, చిక్కటి పులుసుతో ఘుమఘుమలాడే ఆ రుచి వెనుక కొన్ని చిన్న చిన్న రహస్యాలు దాగి ఉన్నాయి. రాగి ముద్ద, జొన్న రొట్టె లేదా ఆవిర్లు కక్కే వేడి వేడి అన్నంలోకి ఈ కూర ఉంటే ఆ మజానే వేరు. మరి అదే పాత రోజులను గుర్తు చేసేలా, పక్కా లోకల్ స్టైల్‌లో తలకాయ కూరను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా.

కావాల్సిన పదార్థాలు:

ముందుగా ఒక కేజీ తలకాయ మాంసాన్ని సిద్ధం చేసుకోవాలి. దీంతో పాటు 2 పెద్ద ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమోటాలు తీసుకోవాలి. రుచి కోసం 3 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి అవసరమవుతాయి. ఇక తాలింపు కోసం 5 టేబుల్ స్పూన్ల నూనెతో పాటు 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, రెండు బిర్యానీ ఆకులను రెడీగా ఉంచుకోవాలి.

Advertisement

Also Read: చుక్క నూనె లేకుండా కరకరలాడే పకోడీలు.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి!

తయారీ విధానం ఇలా..

తలకాయ మాంసాన్ని గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత కుక్కర్‌‌లో శుభ్రం చేసిన మాంసాన్ని వేసి, దానికి తగినంత ఉప్పు, పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 గ్లాసుల నీళ్లు పోసి సుమారు 7 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి.

Advertisement

మాంసం ఉడికేలోపు మరోవైపు వెడల్పాటి బాణలిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి అవి దోరగా వేగేలా చూసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేసి అవి మెత్తగా మగ్గే వరకు ఉడికించి, ఆపై కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.

చివరగా కుక్కర్‌లో ముందుగా ఉడికించి పెట్టుకున్న మాంసాన్ని ఆ నీళ్లతో సహా ఈ మసాలా మిశ్రమంలో వేయాలి. అన్నీ కలిసేలా బాగా కలుపుకొని, ఓ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. పులుసు దగ్గరపడి నూనె పైకి తేలుతున్న సమయంలో గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. అంతే.. ఘుమఘుమలాడే, చిక్కటి మటన్ తలకాయ కూర వడ్డించడానికి రెడీ అయిపోయింది.

Also Read: దూది లాంటి మెత్తని బన్ దోశ.. బ్రేక్‌ఫాస్ట్‌లోకి దీనికి మించిన బెస్ట్ ఆప్షన్ లేదు!

 

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×