E-Paper
Advertisement

Blast In Delhi: ఢిల్లీలో భారీ పేలుడు అలజడి.. భయాందోళనలో ప్రజలు

Blast In Delhi: ఢిల్లీలో భారీ పేలుడు అలజడి.. భయాందోళనలో ప్రజలు
Advertisement

Blast In Delhi: ఢిల్లీలో భారీ పేలుడు అలజడి సృస్టించింది. రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల గోడ వద్ద ఆదివారం ఉదయం భారీ పేలుడు శబ్ధం వచ్చింది. ఈ పేలుడు ధాటికి స్కూల్ గోడతో పాటు సమీపంలో ఉన్న దుకాణాల అద్దాలు పగిలిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే కొన్ని వాహనాల అద్దాలు సైతం ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. పాఠశాలకు సెలవు కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫోరెన్సిక్ బృందాలతోపాటు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు పేలుడుకు గల కారణాలపై నిఘా పెట్టారు.

Advertisement

ఉదయాన్నే ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు ఏం జరుగుతోందో అర్థంకాక బిక్కుబిక్కుమంటూ ఆందోళన చెందారు. మరికొంతమంది భయంతో పరుగులు తీశారు. వెంటనే స్థానికులు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Also Read: ఝార్ఖండ్’లో బీజేపీ తొలి​ జాబితా విడుదల​, మాజీ సీఎం చంపయీ సోరెన్‌, సీఎం వదిన సీతా సోరెన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే ?

Advertisement

ప్రశాంత్ విహార్‌లోని సీఆర్పీఎఫ్ పాఠశాల సమీపంలో ఉదయం 7.47 గంటలకు పేలుడు సంభవించిందని సీనియర్ పోలీస్ అధికారి అమిత్ గోయల్ వెల్లడించారు. ఈ పేలుడుకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టేందుకు నిపుణులను పిలిపించామని తెలిపారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ బృందాలతోపాటు పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు దర్యాప్తు వేగంగా చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని చెప్పారు. అలాగే డ్రెయినేజీ పైపు లైన్ పరిశీలించామన్నారు.

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×