BigTV English

Flipkart Diwali Sale 2024 : ఫ్లిప్కార్ట్ దివాళి సేల్ రేపే ప్రారంభం.. మోటోరోలా ఫోన్స్ పై కళ్ళు చెదిరే ఆఫర్స్

Flipkart Diwali Sale 2024 : ఫ్లిప్కార్ట్ దివాళి సేల్ రేపే ప్రారంభం.. మోటోరోలా ఫోన్స్ పై కళ్ళు చెదిరే ఆఫర్స్

Flipkart Diwali Sale 2024 : ఫ్లిప్కార్ట్ బిగ్ దివాళి సేల్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ కు ఒక రోజు ముందుగానే అంటే ఈ రోజు నుంచే ఆఫర్ ప్రారంభమైంది. ఈ సేల్ లో టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపును ఫ్లిప్కార్ట్ అందిస్తుంది. ఇక ఈ సేల్ లో భాగంగా మోటోరోలా ఫోన్స్ పై స్పెషల్ డిస్కౌంట్ను అందిస్తుంది.


ఫ్లిప్కార్ట్ బిగ్ దివాళి సేల్ 2024 లో మోటోరోలా ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ను ఫ్లిప్కార్ట్ అందిస్తుంది. హై క్వాలిటీ తో పాటు స్పెసిఫికేషన్స్ సైతం అదిరిపోయే విధంగా ఉండే మోటోరోలా 5G ఫోన్స్ ను అత్యంత తక్కువ ధరకే అందిస్తుంది. ఇక ఈ సేల్ లో భాగంగా ఆఫర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేయ్యండి.

Moto G85 5G – మోటోరోలా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేసినా మోటో G85 5G స్మార్ట్ ఫోన్ ధర రూ. 17,999 ఉండేది. అయితే ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ ను రూ. 16,999 కే కొనే అవకాశం ఫ్లిప్కార్ట్ అందిస్తుంది. ఇక స్పెషల్ బ్యాంక్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్స్ కు మరో రూ.1000 అదనంగా తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ అదిరిపోయే 5G స్మార్ట్ ఫోన్ను రూ. 15,999కే సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.


Moto G64 5G – మోటో G64 5G స్మార్ట్ ఫోన్ ధర రూ.16,999 గా ఉండేది. అయితే ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ ఆఫర్లో భాగంగా రూ. 14,999కే అందిస్తుంది. ఇక స్పెషల్ బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే కస్టమర్స్ కు మరో రూ.1000 తగ్గింపు ఉండటంతో ఫోన్‌ను రూ.13,999 ధరతో కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది.

ALSO READ : అదిరిపోయే డిజైన్ తో iQ00 13 లీక్.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఫుల్ డీటెయిల్స్ ఇవే

Moto G45 5G – మోటో G45 5G ఫోన్ రూ.10,999 తో లాంఛ్ అయింది. ఇక ఫ్లిప్కార్ట్ సేల్ లో భాగంగా రూ. 1000 డిస్కౌంట్ లభించడంతో రూ. 9,999 కే స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ ఫోన్ ఫీచర్స్ అయితే అత్యద్భుతంగా ఉన్నాయి. 50 MP కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం, లార్జ్ డిస్ప్లే తో పాటు అధునాతన ఫీచర్స్ ను మోటో తీసుకొచ్చింది.

Moto G04s – ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.7,499 గా ఉండేది. అయితే సేల్ లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.6,999 ఫ్లిప్‌కార్ట్‌లో కొనే అవకాశం ఉంది. ఇక  ప్రత్యేక సేల్ లో. డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో నడిచే ఈ స్మార్ట్ ఫోన్ లో 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ సదుపాయం సైతం కలిగి ఉంది.

Motorola Edze 50 Nyo – మోటోరోలా ఎడ్జ్ 50 నియో ధర రూ. 23,999 గా ఉంది ఇక ఫ్లిప్కార్ట్ సేల్ లో రూ. 1000 తగ్గడంతో ఈ ఫోన్ను రూ. 22999 కే కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ ఫోన్ మీడియాటెక్ డైమండ్ సిటీ 7300 చిప్‌సెట్, 50 MP కెమెరాతో ప్రత్యేక ఫీచర్స్ ను కలిగి ఉంది.

Related News

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

Big Stories

×