E-Paper
Advertisement

Nirmala Sitharaman: నిర్మలా అల్లుడు.. పీఎం మోదీకి రైట్ హ్యాండ్!?

Nirmala Sitharaman: నిర్మలా అల్లుడు.. పీఎం మోదీకి రైట్ హ్యాండ్!?
Advertisement
Nirmala Sitharaman daughter marriage

Nirmala Sitharaman: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్. తమిళ బ్రాహ్మిణ్ ఆమె. అంతపెద్ద పదవిలో ఉన్నా.. చాలా సింపుల్‌గా ఉంటారు. నిర్ణయాలు, రాజకీయ విమర్శలు మాత్రం చాలా పదునుగా ఉంటాయ్. తాజాగా, తన కూతురు వాజ్ఞ్మయి వివాహాన్ని చాలా చాలా సింపుల్‌గా జరిపించారు. బెంగళూరులోని తన ఇంట్లోనే వివాహ వేడుక. అత్యంత సన్నిహితులకే ఆహ్వానం. రాజకీయ నేతలు, వీవీఐపీలు ఎవరినీ పిలవలేదు. అధికార దర్పం ఏమాత్రం ప్రదర్శించలేదు.

నిర్మలా సీతారామన్‌, పరకాల ప్రభాకర్‌ల కూతురే వాజ్ఞ్మయి. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. అమెరికా, నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీలో జర్నలిజం చేశారు. ప్రస్తుతం ప్రముఖ వార్తా సంస్థకు ఫీచర్‌ రైటర్‌, కాలమిస్ట్‌గా చేస్తున్నారు.

Advertisement

ఇక, వాజ్ఞ్మయిని పెళ్లాడిన ప్రతీక్ దోషీ ఎవరనే దానిపై ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన ప్రతీక్.. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. పీఎంవోలో కీలక అధికారిగా పని చేస్తున్నారు. జాయింట్ సెక్రటరీ హోదాలో ఓఎస్‌డీ (రీసెర్చ్ & స్ట్రాటజీ)గా ఉన్నారు. ప్రధానికి లెఫ్ట్, రైట్ ఆయనే అంటారు.

మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సైతం.. సీఎంవోలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా ఉండేవారట ప్రతీక్ దోషీ. మోదీతో సుదీర్ఘ అనుబంధం ఆయనది. సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌లో ప్రతీక్ ఎంబీఏ చేసినట్టు తెలుస్తోంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×