BigTV English
Advertisement

Hibiscus Flower Benefits : మందార పువ్వుతో పుష్క‌లంగా లాభాలు

Hibiscus Flower  Benefits : మందార పువ్వుతో పుష్క‌లంగా లాభాలు
Hibiscus Flower  Benefits


Hibiscus Flower Benefits : మందార.. ఈ చెట్టు ప్రతి ఒక్కరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంట్లో పెంచుకునేందుకు వీలుగా ఉండే మొక్క. ఈ మొక్క ఆకులతో పాటు పువ్వులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. మందార పూలతోపాటు ఆకులను కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా మందార పువ్వులను ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకుంటే మన ముఖం కాంతివంతంగా మరియు అందంగా మారుతుంది. మందార పువ్వు మన జుట్టునే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మందార పువ్వులతో చేసిన టీ తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మందారం పువ్వులతో తయారు చేసిన టీలో విటమిన్ సి, ఐరన్, ఫైబర్, క్యాల్షియంలాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.


వీటిని ప్రతి రోజు తాగడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటుంది. ఈ టీ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. షుగర్ వ్యాధితో బాధపడేవారు, అంతేకాకుండా బీపీతో బాధపడేవారు ఈ టీ ని రెండు పూటలా తాగితే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మందార పువ్వుల టీ తాగడం వల్ల మన లివర్ ఆరోగ్యం మెరుగవుతుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఈ టీ ని తాగడం వల్ల మంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

ఇవి శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. ఈ టీ ని తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన కూడా పడకుండా ఉంటాం. అలాగే మలబద్ధకం సమస్యతో పాటు జీర్ణశక్తి కూడా బాగుప‌డుతుంది. అలాగే ఈ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన బాడీలోని ప్రీ రాడికల్స్‌తో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తాయి. వ్యాయామం చేసేటప్పుడు, ఆటలాడేటప్పుడు ఈ టీ తాగడం వల్ల దాహం తీరడంతో పాటు మన బాడీ టెంపరేచర్ కూడా చల్లబడుతుంది. ఇలా మందార టీతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.


Related News

White Bread: బ్రెడ్ తింటున్నారా ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు.. క్యారెట్ తింటే జరిగేది ఇదే !

Idli Chaat: ఇడ్లీ మిగిలిపోయిందా? ఇలా ఇడ్లీ చాట్ చేసేయండి, క్రంచీగా అదిరిపోతుంది

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు

Kind India: కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ తో కైండ్ ఇండియా.. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే?

Darkness Around The Lips: పెదాల చుట్టూ నలుపు తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Moringa Powder: బరువు తగ్గడానికి.. మునగాకు పొడిని ఎలా వాడాలో తెలుసా ?

Arthritis Pain: కీళ్ల నొప్పులా ? వీటితో క్షణాల్లోనే.. పెయిన్ రిలీఫ్

Big Stories

×