E-Paper
Advertisement

సుశాంత్ రాజ్ పుత్ మేనేజర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆదిత్య థాక్రే, రియా చక్రవర్తిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్!

సుశాంత్ రాజ్ పుత్ మేనేజర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆదిత్య థాక్రే, రియా చక్రవర్తిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్!
Advertisement

Disha Salian Case: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ అనుమానాస్పద మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇందులో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే కుమారుడు ఎమ్మెల్యే ఆదిత్య థాక్రేతో పాటు నటులు డినో మోరియా, సూరజ్ పాంచోలి, రియా చక్రవర్తిల పేర్లను చేర్చడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

తీవ్రమైన ఆరోపణలు

దిశా సాలియాన్ కేసులో హత్య, గ్యాంగ్ రేప్, నేరపూరిత కుట్ర, ఆధారాల విధ్వంసం, తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద సీబీఐ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరణం తర్వాత శవపరీక్ష (పోస్ట్‌మార్టం) జాప్యానికి కారణమైన వైద్యులు, సంబంధిత సిబ్బంది పాత్రపై కూడా దర్యాప్తు జరపనున్నట్లు సీబీఐ వెల్లడించింది. దీనికి సంబంధించిన పత్రాలు, రికార్డులను తమకు అందజేయాలని సీబీఐ ఇప్పటికే ముంబయి పోలీసులను కోరింది.

మాజీ సీఎంపై కుట్ర ఆరోపణలు

Advertisement

దిశా సాలియాన్ తండ్రి సతీష్ సాలియాన్ ఇటీవలే సీబీఐ ఎదుట తన వాంగ్మూలాన్ని సమర్పించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య థాక్రే ఈ కుట్రలో కీలక పాత్ర పోషించారని, కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులు.. కేసు రికార్డులను మార్చడానికి, ఆధారాలను తారుమారు చేయడానికి సహకరించారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

బాంబే హైకోర్టు సెప్టెంబర్ 2న ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సీబీఐ ఈ కేసు విచారణను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వుల సందర్భంగా ముంబై పోలీసుల విచారణ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటన జరిగి ఆరేళ్లవుతున్నా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై ప్రశ్నించింది. విచారణలో అనేక వ్యత్యాసాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఇప్పటివరకు కుటుంబ సభ్యులకు పోస్ట్‌మార్టం నివేదిక గానీ, ఏడీఆర్ ప్రతులు గానీ అందించకపోవడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

Advertisement

Also Read: భూమిని కాపాడుతున్న సూపర్ పవర్స్.. మనుషులు కాదండోయ్.. ఈ 6 జీవులే రియల్ హీరోస్!

కేసు నేపథ్యం

2020 జూన్ 8న ముంబయిలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ 14వ అంతస్తు నుంచి కిందపడి దిశా సాలియాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె చనిపోయిన కొన్ని రోజులకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా తన ఇంట్లో మృతి చెంది కనిపించారు. ప్రారంభంలో ముంబయి పోలీసులు దీనిని ఆత్మహత్యగా భావించి ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేశారు. అయితే తన కుమార్తెపై సమూహ అత్యాచారం చేసి హత్య చేశారని దీనిపై సరైన విచారణ జరగలేదని దిశా తండ్రి కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగింది.

Also Read: కుక్క పెట్టిన చిచ్చు.. లిఫ్ట్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్!

Tags

Related News

నవ వధువు దారుణ హత్య.. భార్య తల నరికి ఫ్రిజ్‌లో దాచిన హంతకుడు

సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు, పార్టీల్లో చర్చ

కుక్క పెట్టిన చిచ్చు.. లిఫ్ట్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్!

రియా హత్య కేసులో.. అసలు విషయాలు తేలకుండానే, భార్యని చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టి

హిట్-అండ్-రన్ ఘటన.. వుమెన్ రైడర్ని వెంటాడి కారుతో ఢీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

కేదార్‌నాథ్ మార్గంలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు-రాళ్లు, యాత్రకు అంతరాయం

8వ ఆసియా కప్ విజేత భారత్.. మహిళల టీమ్‌పై అమిత్ షా ప్రశంసల వర్షం!

Big Stories

Advertisement
×