E-Paper
Advertisement

హిట్-అండ్-రన్ ఘటన.. వుమెన్ రైడర్ని వెంటాడి కారుతో ఢీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

హిట్-అండ్-రన్ ఘటన.. వుమెన్ రైడర్ని వెంటాడి కారుతో ఢీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Advertisement

Gurugram: గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో భయంకరమైన హిట్-అండ్-రన్ ఘటన వెలుగులోకి వచ్చింది. వేగంగా వస్తున్న ఓ వైట్ సెడాన్ కారు.. ఓ మహిళా రైడర్‌ను వెంబడించి మరీ మోటార్‌ సైకిల్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే..

గురుగ్రామ్‌లో హిట్-అండ్-రన్ ఘటన

గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో జరిగిన భయంకరమైన హిట్-అండ్-రన్ ఘటన‌లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గురుగ్రామ్‌కు చెందిన సియా అనే యువతి స్పోర్ట్స్ బైక్‌ నడుపుతోంది. కొందరు వ్యక్తులు కారుతో ఆ యువతిని వెంబడించారు. ఇది గమనించిన సదరు యువతి, తన వెంటపడొద్దని వారిని గట్టిగా వారించారు. మద్యం సేవించిన డ్రైవర్‌ను దూరంగా ఉండమని కోరింది. యువతి మాటలను మనసులో పెట్టుకున్న కొందరు యువకులు, యువతి రైడర్ కొంతదూరం వెళ్లాక వెనుక నుంచి వేగంగా వచ్చి కారుతో బైక్‌ను బలంగా డ్యాష్ ఇస్తూ వెళ్లారు.

యువతిలో కారులోని వాగ్వాదం, యువతి బైక్‌ని ఢీ కొట్టిన కారు

Advertisement

సదరు యువతి ఆ రోడ్డుపై పడిపోయింది. బైక్‌ కొంత దూరం మేర జారుకుంటూ వెళ్లిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన సియా బైక్‌పై అమర్చిన యాక్షన్ కెమెరాలో అంతా రికార్డు అయ్యింది. ఆ సమయంలో సియా వెనుక వస్తున్న ఆమె స్నేహితులు.. కారును ఆపడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కారులోని ఓ వ్యక్తి.. వారితో దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సియా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో అది కాస్త వైరల్‌ అయ్యింది.

ALSO READ: కేదార్‌నాథ్ మార్గంలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు-రాళ్లు, యాత్రకు అంతరాయం

Advertisement

దూరంగా వెళ్లమన్నందుకు కారులోని వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో వారంతా మద్యం మత్తులో ఉన్నారని పేర్కొంది. వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని గురుగ్రామ్‌ పోలీసులను యువతి కోరింది. కారు నడుపుతున్న వ్యక్తి కాకుండా అందులో ఎంతమంది ఉన్నారో స్పష్టంగా తెలియరాలేదు. యువతిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు సమాచారం. వీడియో ఆధారంగా గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

?utm_source=ig_embed&ig_rid=AC3pQPGaEzAIdjea24k883S

 

Related News

కేదార్‌నాథ్ మార్గంలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు-రాళ్లు, యాత్రకు అంతరాయం

8వ ఆసియా కప్ విజేత భారత్.. మహిళల టీమ్‌పై అమిత్ షా ప్రశంసల వర్షం!

ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భయంతో భవనం పైనుంచి దూకిన జనం!

గుజరాత్‌లో తాగునీటి సంక్షోభం.. మోదీ జల్ జీవన్ మిషన్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!

జైల్లోనూ మారని బుద్ధి.. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో పదుల సంఖ్యలో పో*ర్న్ వీడియోలు!

15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్..

జిన్ పింగ్ రాకకు ముందు.. చైనా రాయబారి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×