E-Paper
Advertisement

సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు, పార్టీల్లో చర్చ

సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు, పార్టీల్లో చర్చ
Advertisement

Bengaluru: దేశంలోని రాజకీయాలు ట్రెండ్ మారింది. నేతలు.. ఎప్పుడు, ఎవరు, ఎటువైపు ఉంటారో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారం ఎటువైపు ఉంటే అటువైపుకి వెళ్లిపోతున్నారు. మా పార్టీతో విపక్షాలకు చెందిన చాలామంది నేతలు టచ్‌లో ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కర్ణాటక సీఎం డీకే శివకుమార్. ఇంతకీ ఆయన వ్యాఖ్యలు వెనుక ఏం జరుగుతోంది? ఇదే ప్రశ్న కన్నడ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు, వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు

కర్ణాటక అసెంబ్లీకి మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచి పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ముఖ్యంగా విపక్ష బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ, జేడీఎస్ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు, కేంద్ర స్థాయి నాయకులు తమతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని బహిరంగంగా ప్రకటించారు. మాజీ బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా పని చేసిన ఎన్ఎల్ నరేంద్రబాబు అధికారికంగా కాంగ్రెస్ గూటికి చేరిన తరుణంలో సీఎం డీకే శివకుమార్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.

కన్నడ పార్టీల్లో తీవ్ర చర్చ.. నేతలు ఎవరంటూ ఆరా

Advertisement

బీజేపీ-జేడీఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటున్న నేతల వివరాలను సేకరించి సమగ్ర జాబితాను తయారు చేయాలని ఆయా జిల్లాల మంత్రులను, పార్టీ పదాధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, అధిష్ఠానం నిర్ణయాలను నమ్మి వచ్చే ప్రతి నాయకుడికి మా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. వారందరినీ కలుపుకుని భవిష్యత్తులో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి డీకే శివకుమార్. గడిచిన దశాబ్దమున్నర కాలంపాటు బీజేపీకి దేశ ప్రజలు అవకాశం ఇచ్చారని, ప్రస్తుతం యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వైపు ఆశగా చూస్తోందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ వ్యూహాత్మక ఆపరేషన్ ప్రతిపక్ష పార్టీలు బీజేపీ-జేడీఎస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

ALSO READ: రియా హత్య కేసులో.. అసలు విషయాలు తేలకుండానే, భార్యని చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టి

Related News

కుక్క పెట్టిన చిచ్చు.. లిఫ్ట్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్!

రియా హత్య కేసులో.. అసలు విషయాలు తేలకుండానే, భార్యని చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టి

హిట్-అండ్-రన్ ఘటన.. వుమెన్ రైడర్ని వెంటాడి కారుతో ఢీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

కేదార్‌నాథ్ మార్గంలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు-రాళ్లు, యాత్రకు అంతరాయం

8వ ఆసియా కప్ విజేత భారత్.. మహిళల టీమ్‌పై అమిత్ షా ప్రశంసల వర్షం!

ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భయంతో భవనం పైనుంచి దూకిన జనం!

గుజరాత్‌లో తాగునీటి సంక్షోభం.. మోదీ జల్ జీవన్ మిషన్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!

Big Stories

Advertisement
×