Singareni R&R: స్వేచ్ఛ బ్యూరో: సింగరేణి భూసేకరణలో భూనిర్వాసితులకు అందాల్సిన R&R ప్రయోజనాల కోసం దాదాపు ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న కొమ్మేపల్లి మసీదు ఇమామ్ మహమ్మద్ ముంతాజ్ అన్సారీకి ఎట్టకేలకు న్యాయం జరిగిందని తెలిపారు. తనకు R&R పరిహారంతో పాటు ఇంటి స్థలం కూడా మంజూరైందని, మసీదు సమీపంలోనే స్థలం కేటాయించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తనకు R&R ప్యాకేజీకి అర్హత ఉన్నప్పటికీ, తనకు తెలియకుండానే WP No.1174/2021లో తన పేరును చేర్చారని ముంతాజ్ అన్సారీ తెలిపారు.
2020 విజిలెన్స్ విచారణ సమయంలో అధికారులకు కొందరు వ్యక్తులు బలవంతంగా నా చేత యాదాల శ్రీనివాస్ పై తప్పుడు సమాచారం ఇచ్చిన విషయం తెలిసి కూడా అవేమీ మనసులో పెట్టుకోకుండా నాకు న్యాయం కోసం Wp1174/2021 కేసులో నుంచి తన పేరును ఉపసంహరింపజేసీ, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న తన R&R ఫైల్‌ను హైదరాబాద్‌లోని R&R కమిషనర్ కార్యాలయంలోనీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వారి అనుమతి కోసం వాస్తవ పరిస్థితులను RTI ఆధారాలతో వివరంగా చెప్పడంతో ఉన్నత అధికారులు అనుమతి పొందడంలో యాదాల శ్రీనివాస్ సహకరం మర్చిపోలేనిదని, కుల, మత భేదాలు లేకుండా తనకు అండగా నిలిచిన శ్రీనివాస్‌కు ముంతాజ్ అన్సారీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే దళిత వర్గానికి చెందిన అతని సహాయం తీసుకోవడంపై గ్రామంలో కొందరి నుంచి వ్యతిరేకత ఎదురైందని, తనని మసీదు ఇమామ్‌గా తొలగించి, కుటుంబ పోషణ భారం పై కూడా ఒత్తిడి తేచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
కొమ్మేపల్లి R&R వ్యవహారానికి సంబంధించిన వివరాల ప్రకారం.. 2016లో అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ 258 మందిని R&R పరిహారానికి అర్హులుగా గుర్తించి సింగరేణి అధికారులకు నష్టపరిహారం చెల్లించాలని లేఖ రాశారని, అదే సమయంలో జాయింట్ కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే జిల్లా స్థాయి అధికారుల ఆదేశాలు లేకుండానే సత్తుపల్లి మండల తహసీల్దార్ 258 జాబితాలో నుండి 29 మంది పేర్లను తొలగించి 229 మంది మాత్రమే తుది జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారనీ. ఈ తొలగింపు ప్రక్రియ గ్రామస్తులకు నోటీసులు ఇవ్వకుండా ఏ ప్రాతిపదికన జరిగిందనే అంశంపై అప్పటినుంచే ప్రశ్నలు తలెత్తాయని గ్రామస్తులు చెబుతున్నారు. తొలగించిన 29 మందిలో 12 మందిని మాత్రం 2018లో అప్పటి జిల్లా కలెక్టర్ R&R కమిషనర్‌కు R&R పరిహారం కోసం సిఫారసు చేశారని, మిగిలిన వారి విషయంలో ఎందుకు సిఫారసు చేయలేదనే అంశంపై కొమ్మేపల్లికి చెందిన కొందరు విద్యార్థులు R&R కమిషనర్‌కు ఫిర్యాదు చేసి, మిగిలిన వారి అర్హతను కూడా పరిశీలించాలని కోరారని దీంతో ఈ వ్యవహారంపై విచారణ ప్రక్రియ ప్రారంభమైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
Also read: సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు
కొమ్మేపల్లి R&R వ్యవహారాన్ని 2020లో జాతీయ SC, ST, BC కమిషన్ల దృష్టికి తీసుకెళ్లిగా, R&R ప్యాకేజీ అమలుపై చర్యలు తీసుకోవాలని జాతీయ ST కమిషన్ హైదరాబాద్‌లోని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి సిఫారసు లేఖ పంపారని అక్టోబర్‌లో ఆ సిఫారసుపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ కల్లూరు RDOను ఆదేశించినట్లు సమాచారం. ఇదే సమయంలో సెప్టెంబర్ నెలలో ఈ 12 మంది దాఖలు చేసిన దరఖాస్తు పై, గ్రామంలోని స్టూడెంట్స్ చేసిన ఫిర్యాదు పై హైదరాబాద్ R&R కమిషనర్ సమగ్ర విచారణ జరపాలని వచ్చిన లేఖ ఆధారంగా కూడ ఆదేశాలు జారీ అయినట్లు యాదాల శ్రీనివాస్ తెలిపారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు RDO, తహసీల్దార్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి భూసేకరణ చట్టం 2013, సెక్షన్ 3 ప్రకారం నిర్దేశిత కటాఫ్ తేదీకి ముందు కనీసం మూడేళ్ల నివాసం ఉండాలనే నిబంధనతో పాటు సంబంధిత రెవెన్యూ రికార్డులను పరిశీలించి, విచారణ అనంతరం ఆ 12 మందికి అర్హత లేదని , వారు ఈ గ్రామస్తులు కాదని పేర్కొంటూ ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారని, ఈ విషయం తెలిసిన అనంతరం తనతో ఉన్న 11మంది అనర్హులు అనే విషయాన్ని వారికి దాచిపెట్టి, కోర్టులో కూడా కల్లూరు RDO వీరిని రద్దు చేశారనే వాస్తవాన్ని దాచిపెట్టి 2018లో వివాదంలో ఉన్న ప్రొసీడింగ్స్ ప్రకారం అమలు చేయాలని తప్పుడు అఫిడవిట్ తో దళారిగా వ్యవహరించే ప్రభుత్వ లెక్చరర్ మిగిలిన 11 మందితో 2021 జనవరిలో హైకోర్టులో WP No.1174/2021 దావ వేశారని పేర్కొన్నాడు.
భౌతిక విచారణలో అనర్హులుగా గుర్తించిన జాబితా పూర్తిస్థాయిలో ప్రతిబింబించకుండా రెవెన్యూ కౌంటర్ సిద్ధం చేసి ప్రభుత్వ న్యాయవాదికి అందించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాన్ని గమనించిన యాదాల శ్రీనివాస్ WP No.1174/2021లో ఇంప్లీడ్ అయినట్లు తెలిపారు. కోర్టు ముందు ఉంచాల్సిన క్షేత్రస్థాయి విచారణ వివరాలు, సంబంధిత రికార్డులను తాను సమర్పించాల్సి వచ్చిందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా, కల్లూరు భూసేకరణ విభాగంలో సుమారు ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ R&R వ్యవహారంపై కార్యాలయానికి వచ్చే RDOలు, ఇతర అధికారులకు తప్పుదారి పట్టించే సమాచారం అందిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నివేదికల రూపకల్పనలో జోక్యం చేసుకుని అధికారులతో సంతకాలు చేయించి, అనంతరం సమస్యలు తలెత్తితే ఆ నివేదికల బాధ్యతను బదిలీ అయిన అధికారులపై మళ్లిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
Also read: ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఇండ్ల పత్రాల జారీకి డేట్ ఫిక్స్!
RDO చేత అనర్హులుగా గుర్తించబడిన ఈ 12 మంది కొమ్మేపల్లి R&R సెంటర్లో మిగిలిన ఖాళీ ఇండ్ల ప్లాట్లు 84, 96, 101, 110, 112, 136, 146, 178, 183, 210, 217, 227 కబ్జా చేశారని, విచారణ చేసి కబ్జా చేసిన ప్లాట్లను రికవరీ చేయాలని చేసిన ఫిర్యాదుతో కల్లూరు సబ్ కలెక్టర్ సత్తుపల్లి మండల తహసీల్దార్ కి నోటీస్ పంపినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఇండైరెక్ట్ గా మండల తహసీల్దార్ ఈ అక్రమ కబ్జాదారులకు మద్దతు ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
R&R ప్యాకేజీకి అర్హులైన నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తాను చేస్తున్న పోరాటం నేపథ్యంలో యాదాల శ్రీనివాస్ పై విజిలెన్స్ విచారణ జరగడం అప్పట్లో గ్రామంలో చర్చనీయాంశమైందని, 2020 లో కల్లూరు RDO చేత R&R ప్యాకేజీ అనర్హులుగా నమోదైన వారిచేత గ్రామస్తుల పేరుతో చేసిన ఫిర్యాదు పై విచారణలో భాగంగా విజిలెన్స్ అధికారులకు ఈ 12 మందిలో ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు తనపై తప్పుడు ప్రకటనలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విజిలెన్స్ ఫిర్యాదు వెనుక కూడా సీనియర్ అసిస్టెంట్ పాత్ర ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు.కొమ్మేపల్లి R&R సెంటర్‌లో ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు ఉన్న ప్లాట్లను రికవరీ చేయాలని, నిర్వాసితుల అర్హతలపై అందుతున్న నివేదికలను స్వతంత్రంగా పరిశీలించాలని యాదాల శ్రీనివాస్ కోరుతున్నారు. ఇలాంటి సీనియర్ అసిస్టెంట్ నుంచి అందే సమాచారంపై ఆధారపడకుండా సంబంధిత రికార్డులను పరస్పరం పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సబ్ కలెక్టర్ కల్లూరు కి విజ్ఞప్తి చేశారు.
Also read: గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!