Tanveer Ahmed On Asia Cup 2026: ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Asia Cup 2026) విజేతగా ఉమెన్స్ టీమిండియా నిలిచింది. అందరూ ఊహించినట్లుగానే దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Dubai International Cricket Stadium) వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకను చిత్తు చేసి.. 8వ సారి టైటిల్ అందుకుంది ఉమెన్స్ టీమ్ ఇండియా. ఈ క్రమంలో ఎప్పటిలాగే ట్రోఫీని తీసుకోకుండానే ఇండియాకు వెళ్లిపోయింది టీమిండియా. మొహ్సిన్ నఖ్వీ లాంటి దుర్మార్గుడి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోకూడదని బీసీసీఐ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే టీమిండియా ఉమెన్స్ జట్టు సూర్యకుమార్ యాదవ్ లాగానే నడుచుకుంది. అయితే టీమిండియా ట్రోఫీని తీసుకోక పోవడంపై సోషల్ మీడియాలో బినాభిప్రాయాలు వస్తున్నాయి.
ఆసియా కప్ ట్రోఫీ వివాదం పై తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ కూడా స్పందించారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఫైనల్స్ లో గెలిచిన టీమిండియా కు ట్రోఫీ ఇవ్వకూడదని..మొహ్సిన్ నఖ్వీ వచ్చేసాడని బాంబు పేల్చారు. టీమిండియా అంటేనే చీటర్స్ అని.. వాళ్లకు ట్రోఫీలు అవసరం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి మ్యాచ్ లో ఫిక్సింగ్ చేసి… గెలవడం టీమిండియాకు అలవాటైపోయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అందుకే టీమిండియా కు తగిన బుద్ధి చెప్పేందుకు… మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని లేపేసాడు అని తప్పు ఒప్పుకున్నారు.
ఆసియా కప్ 2026 ట్రోఫీ తీసుకోకపోవడంపై టీమిండియాను ఉద్దేశించి తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ ట్రోఫీని అందుకొని టీమిండియా.. డబ్బులు మాత్రం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. ఆసియా కప్ ట్రోఫీ గెలిచిన జట్టుగా టీమిండియా కు దాదాపు 20 లక్షల ప్రైజ్ మనీ రాబోతుందని గుర్తు చేశారు. ఆ ప్రైజ్ మనీ చెక్కు పైన మొహ్సిన్ నఖ్వీ సంతకం పెడతాడని.. వివరించారు. అప్పుడు పాకిస్తాన్ కు చెందిన మొహ్సిన్ నఖ్వీ సంతకం పెట్టిన డబ్బులే కదా ? మీరు తీసుకునేది.. ట్రోఫీ వద్దనుకున్న వాళ్ళు ఈ చెక్కు కూడా వదిలేయాలని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. చీము నెత్తురు ఉంటే ఆ చెక్ కూడా తీసుకోవద్దు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.
ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ విజేతగా నిలిచిన టీమిండియా కు 18 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రైజ్ మనీ దక్కనుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి ఈ డబ్బులు అందుతాయి. అయితే వచ్చిన డబ్బులను బీసీసీఐ తీసుకోకుండా… ఆసియా ఖండంలో ఉన్న చిన్న క్రికెట్ జట్ల అభివృద్ధికి ఖర్చు పెట్టనున్నారు. అంటే ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమిండియా కు ట్రోఫీతో పాటు ఒక్క రూపాయి రాకుండా పోయింది.