E-Paper
Advertisement

రియా హత్య కేసులో.. అసలు విషయాలు తేలకుండానే, భార్యని చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టి

రియా హత్య కేసులో.. అసలు విషయాలు తేలకుండానే, భార్యని చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టి
Advertisement

Guwahati: భార్యపై అనుమానం పెనుభూతమైంది. తట్టుకోలేకపోయాడు ఆమె భర్త. చంపితేనే గానీ తన పగ తీరదని భావించాడు. అత్యంత దారుణంగా చంపేశాడు. పోలీసులకు దొరికిన తర్వాత అంతా చెప్పాడు. అనూహ్య క్రమంలో నిందితుడు ఈ ఉదయం చనిపోయాడు. గౌహతిలో సంచలనం రేపిన 25 ఏళ్ల రియా హత్య కేసు ఇది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు, ఆమె భర్త రమానుజ్‌ గోస్వామి మృతి చెందాడు. అసలు రియా-రామానుజ్ కేసులోకి ఒక్కసారి వెళ్లొద్దాం.

రియా హత్య కేసు కొత్త మలుపు

గౌహతి సమీపంలోని హటిగావ్‌-బసిస్థాపూర్‌ ప్రాంతంలో రమానుజ్‌-భార్య రియా తాలుక్దార్‌ నివాసం ఉండేవారు. ఆరు నెలల కిందట వివాహం జరిగింది. భార్యపై అనుమానంతో రామానుజ్‌ తరచూ గొడవపడేవాడు. సెప్టెంబర్‌ మూడున భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో రియాపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత తలను వేరు చేసి నల్లటి పాలిథిన్‌ కవర్ చుట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచాడు. ఘటన జరిగి మూడు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్‌ 6న ఇంటి నుంచి దుర్వాసన రావడం మొదలుపెట్టింది. దీంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

నిందితుడు, భర్త రామానుజ్ మృతి

Advertisement

పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా రియా మృతదేహం కనిపించింది గానీ తల కనిపించలేదు. ఇంట్లో సామాన్లు పరిశీలించగా ఫ్రిడ్జ్‌లోని పాలిథిన్‌ సంచిలో ఆమె తలను గుర్తించారు పోలీసులు. ఘటన తర్వాత రమానుజ్‌ కనిపించకపోవడంతో గాలింపు చేపట్టారు. చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయి భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలానికి తీసుకెళ్లిన సమయంలో మీడియాతో మాట్లాడాడు రమానుజ్‌. భార్యను చంపినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, తన భార్య క్యారెక్టర్‌ మంచిది కాదన్నాడు.

ALSO READ: హిట్-అండ్-రన్ ఘటన.. వుమెన్ రైడర్ని వెంటాడి కారుతో ఢీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Advertisement

జైలు శిక్ష తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని చంపుతానంటూ హెచ్చరించాడు. రియాతో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు? ఎవర్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశాడు? కస్టడీలో నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేసినా నోరు విప్పలేదు రమానుజ్‌. 30 ఏళ్ల రమానుజ్‌ను వైద్య పరీక్షల తర్వాత సోమవారం వేకువజామున హటిగావ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నారు పోలీసులు. నరకాసుర్‌ పహార్‌ ప్రాంతం వద్ద పోలీసులపై ఒక్కసారిగా దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వాహనం నుంచి కిందకు దూకినట్లు పోలీసులు తెలిపారు. లోయలో పడటంతో తీవ్రంగా గాయపడిన రామానుజ్, వెంటనే పోలీసులు గౌహతి మెడికల్‌ కాలేజ్‌‌కి తరలించారు. వైద్యులు పరీక్షలు చేసినప్పటికే నిందితుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. రియా కేసులో కొన్ని ప్రశ్నలకు అతడి నుంచి సమాధానాలు రాలేదు. అంతలో భర్త-నిందితుడు రమానుజ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Related News

సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు, పార్టీల్లో చర్చ

కుక్క పెట్టిన చిచ్చు.. లిఫ్ట్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్!

హిట్-అండ్-రన్ ఘటన.. వుమెన్ రైడర్ని వెంటాడి కారుతో ఢీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

కేదార్‌నాథ్ మార్గంలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు-రాళ్లు, యాత్రకు అంతరాయం

8వ ఆసియా కప్ విజేత భారత్.. మహిళల టీమ్‌పై అమిత్ షా ప్రశంసల వర్షం!

ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భయంతో భవనం పైనుంచి దూకిన జనం!

గుజరాత్‌లో తాగునీటి సంక్షోభం.. మోదీ జల్ జీవన్ మిషన్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!

Big Stories

Advertisement
×